బాక్సాఫీస్ వద్ద ‘వకీల్ సాబ్’ హవా కొనసాగుతూనే ఉంది. అద్దిరిపోయే కలెక్షన్లతో దుమ్ము లేపుతోంది. ఇప్పటికే రూ.100 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం.. మరో మైలు రాయిని రీచ్ అయ్యేందుకు పరుగులు పెడుతోంది. లాంగ్ రన్ లో 150 కోట్లు వసూళ్లు చేయడమే లక్ష్యంగా సినిమా ముందుకు సాగుతోంది. మరి, ఏడో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం..
ఆరవ రోజున వకీల్ సాబ్ చిత్రం వరల్డ్ వైడ్ గా 113.5 కోట్ల గ్రాస్, 72.95 కోట్ల షేర్ సాధించింది. అయితే.. తొలి ఐదు రోజులు సాధించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఆ లెక్కన చూస్తే.. ఆరో రోజున సుమారు 35 నుంచి 40 శాతం మేర వసూళ్లు తగ్గాయి.
ఏడో రోజున పరిస్థితి చూస్తే.. మరింతగా తగ్గినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వైజాగ్ లో, ఉత్తరాంధ్ర, సీడెడ్ లో కలెక్షన్లు నిలకడగా సాగుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ రేషియో తగ్గినట్టుగా తెలుస్తోంది. 60 శాతం లోపు సీట్లు ఫిల్ అవుతున్నట్టు సమాచారం.
దీంతో.. ఏడో రోజైన గురువారం వసూళ్లు మరికాస్త తగ్గే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు మిగిలిన ప్రాంతాల్లోనూ ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో రూ.5 కోట్ల నుంచి 8 కోట్ల మధ్య వసూలు కావొచ్చని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.
అయితే.. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలోనూ వకీల్ సాబ్ ను మించిన ప్రత్యామ్నాయం లేదు. సమీప భవిష్యత్ లో రాదు కూడా. అందువల్ల.. వకీల్ సాబ్ ప్రభంజనం కాస్త తగ్గినా.. దూకుడు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. మరి, లాంగ్ రన్ లో ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.