Bigg Boss S7 : బ్రేకింగ్.. బిగ్ బాస్-7లో బేబీ హీరోయిన్, టీఆర్పీ బద్దలేనా?

హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ తెలుగు పిల్ల బిగ్ బాస్ 7 కి ఎంపికయ్యారట. త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు షోలో వైష్ణవి చైతన్య కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

Written By: NARESH, Updated On : July 21, 2023 3:19 pm
Follow us on

Bigg Boss S7 – Vaishnavi Chaitanya : యూట్యూబ్ సెలబ్రిటీ వైష్ణవి చైతన్య తాజాగా బేబీ మూవీతో టాలీవుడ్ సెన్సేషన్ గా అవతరించింది. బోల్డ్ రోల్ చేసిన వైష్ణవి చైతన్య సాహసం గురించి జనాలు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. స్టార్స్ సైతం వైష్ణవి బాగా నటించింది. ఆమె ఛాలెంజింగ్ రోల్ చేశారని కొనియాడుతున్నారు. ఆమె సాహసాన్ని మెచ్చుకుంటున్నారు. ఇక బేబీ కమర్షియల్ గా భారీ హిట్ కొట్టింది. చిన్న సినిమాగా విడుదలై కాసుల వర్షం కురిపిస్తుంది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన బేబీ చిత్రాన్ని ఎస్ కే ఎన్ నిర్మించారు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ హీరోలుగా నటించారు.

హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ తెలుగు పిల్ల బిగ్ బాస్ 7 కి ఎంపికయ్యారట. త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు షోలో వైష్ణవి చైతన్య కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సూపర్ హిట్ కొట్టి ఫార్మ్ లోకి వచ్చిన వైష్ణవి బిగ్ బాస్ హౌస్లోకి వెళుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఆమె గతంలోనే అగ్రిమెంట్ పై సైన్ చేశారట. మేకర్స్ అదృష్టం బాగుండి బేబీ మూవీతో ఆమె స్టార్ అయ్యారు. ఈ పరిణామం బిగ్ బాస్ 7 కి బాగా కలిసి వస్తుందంటున్నారు. మరి ఇదే నిజమైతే ఆడియన్స్ క్రేజీగా ఫీల్ అవుతారు. వైష్ణవి చైత్యనకు బేబీ మూవీతో బోల్డ్ ఇమేజ్ వచ్చిన నేపథ్యంలో ఆమె నుండి స్పైసీ కంటెంట్, మోర్ ఎంటర్టైన్మెంట్ ఆశించే అవకాశం కలదు. ఇక చూడాలి ఈ ప్రచారంలో ఏ మేరకు నిజం ఉందో.

కాగా బిగ్ బాస్ సీజన్ 7కి రంగం సిద్ధమైంది. ఆల్రెడీ రెండు ప్రోమోలు వచ్చేశాయి. హోస్ట్ విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది. వరుసగా ఐదో సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. రానాతో పాటు పలువురి పేర్లు వినిపించినా నాగార్జునే మళ్ళీ అని తేలిపోయింది. ఇక సీరియల్ హీరో అమర్ దీప్ చౌదరి భార్య తేజస్వినితో పాటు ఎంట్రీ ఇస్తున్నారట. దీపికా పిల్లి, శోభిత శెట్టి, సింగర్ మోహన భోగరాజుతో పాటు కొందరి పేర్లు కంటెస్టెంట్స్ గా ప్రచారం అవుతున్నాయి.