https://oktelugu.com/

GreenLand : ఆ దేశంలో రోడ్లు లేవు.. రైలు మార్గాలు లేవు.. పగలే కాదు.. రాత్రి కూడా సూర్యుడే కనిపిస్తాడు

రవాణా మార్గాలు అభివృద్ధికి చిహ్నాలు. పల్లెలైనా, పట్టణాలైనా, దేశమైనా, ప్రపంచమైనా అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యం మెరుగ్గా ఉండాలి. కానీ, ఆ దేశంలో రోడ్లు లేవు.. రైలు మార్గాలూ కానరావు. పగరు, రాత్రి సూర్యుడు కనిపిస్తాడు..

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 18, 2024 / 11:09 AM IST

    Greenland

    Follow us on

    GreenLand  : ఒక ఊరైనా.. పట్టణమైనా.. నగరమైనా అభివృద్ధి చెందాలంటే.. ప్రధానంగా రవాణా సౌకర్యం ఉండాలి. రవాణా మార్గాలు ఉన్న ప్రాంతాలే వేగంగా అభివృద్ధి చెందుతాయి. అందుకే పాలకులు ముందుగా రవాణా సౌకర్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. రవాణా మార్గాల్లో రోడ్లు, రైలు, విమాన, జల, సముద్ర మారాగలు ఉన్నాయి. వీటిలో మొదటి రోడ్లు, తర్వాత రవాణా, ఆ తర్వాత విమాన మార్గాలకు ప్రాధాన్యం ఉంది. జల మార్గాలు ఎక్కువగా వ్యాపార, వాణిజ్య పరంగానే ఎక్కువగా ఉపయోగపడుతుంది. అందుకే ప్రభుత్వాలు ఎక్కువగా రోడ్లకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కానీ ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇప్పటికీ రోడ్లు, రైలు మార్గాలు లేవు. కొన్ని దేశాలకు విమాన సదుపాయం లేదు. ఇందుకు కారణం అక్కడి వాతావరణ పరిస్థితులు, కొన్ని దేశాలు పేదరికం కారణంగా సదుపాయం కల్పించలేకపోయాయి. ఇలాంటి దేశం ఒక దేశం గురించి తెలుసుకుందాం. ఆ దేశంలో పగలు, రాత్రి సూర్యుడు కనిపించడం మరో ప్రత్యేకత. ప్రపంచంలో రోడ్లు, హైవేలు లేని దేశం గ్రీన్‌ల్యాండ్‌. రోడ్లతో పాటు రైలు మార్గాలు కూడా లేవు. అందుకే గ్రీన్‌ల్యాండ్‌ రవాణా వ్యవస్థ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ దేశ ప్రజలు ప్రయాణించడానికి హెలికాప్టర్‌ లేదా విమానం సహాయం తీసుకుంటారు. ఈ దేశంలో రెడ్‌ లైట్లు ఉన్న ఏకైక నగరం నుక్‌. నుక్‌ నగరం దేశ రాజధాని. ఇక్కడ మాత్రమే మనకు రోడ్లు కనిపిస్తాయి. మిగతా ప్రాంతంలో ఉండవు.

    విస్తీర్ణంలో పెద్దది..
    విస్తీర్ణం పరంగా చూస్తే గ్రీన్‌ల్యాండ్‌ ప్రపంచంలోనే 12వ అతిపెద్ద దేశం. ఇది బ్రిటన్‌ కంటే 10 రెట్లు పెద్దది. ఇంత పెద్ద దేశం ఉన్నప్పటికీ ఇక్కడ రోడ్లు లేదా హైవేలు ఎందుకు నిర్మించలేదనే ప్రశ్నలు మీకు రావచ్చు. అయితే, దీనికి ఒక కారణం ఉంది. నిజానికి, గ్రీన్‌ల్యాండ్‌ వాతావరణమే ఇక్కడి రవాణ వ్యవస్థను ఇలా మార్చింది. ఈ దేశంలోని 80 శాతం ప్రాంతం మంచుతో కప్పబడి ఉంది. ఇక్కడి సవాలుతో కూడిన వాతావరణం కారణంగా రోడ్లు వేయడం కష్టం. తారు వేయలేని విధంగా ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. అందువల్ల, ప్రజలు కొంత దూరం వెళ్లవలసి వస్తే, వారు స్నోమొబైల్‌ లేదా డాగ్‌ స్లెడ్డింగ్‌ వంటి మార్గాలను ఉపయోగిస్తారు. అయితే, గత కొన్నేళ్లుగా ఇక్కడ విమానాలు, హెలికాప్టర్లు కూడా ఎక్కువగా వాడటం మొదలుపెట్టారు. సముద్ర మార్గంలో ప్రయాణించగలిగే వారికి వేసవి కాలంలో పడవలను ఉపయోగిస్తారు.

    పగలూ రాత్రి సూర్యుడు..
    గ్రీన్‌ల్యాండ్‌ పర్యాటక పరంగా బాగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడి ప్రజలకు భౌగోళిక శాస్త్రం అంటే పిచ్చి. ప్రపంచ దేశాలకు చెందిన అలాంటి చాలా మంది ఈ ప్రాంతానికి వస్తుంటారు. ఇక్కడ రెండు నెలలు (మే 25 నుండి జూలై 25 వరకు) సూర్యుడు అస్తమించడు. సూర్యుడు పగలు, రాత్రి రెండూ సమయాల్లోనూ ఆకాశంలో కనిపిస్తాడు. ఇదే గ్రీన్‌ల్యాండ్‌ మరో ప్రత్యేకత. కానీ గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా, గ్రీన్‌ఆ్యండ్‌ వాతావరణం వేగంగా మారుతోంది. ఇక్కడ మంచు వేగంగా కరుగుతుంది. పచ్చదనం కనిపించడం ప్రారంభించింది. ఈ కారణంగా ప్రజలు ఈ దేశానికి వెళ్లడం ప్రారంభించారు. టూరిజం విషయానికి వస్తే గ్రీన్‌ల్యాండ్‌ చాలా ఖరీదైనది. ఎందుకంటే ఇక్కడ రైల్వేలు, హైవేలు, రోడ్లు లేవు కాబట్టి హెలికాప్టర్, విమానం లేదా బోటు ఒక చోటి నుంచి మరో చోటికి వెళ్లేందుకు వినియోగిస్తున్నారు. ఇక్కడ హోటల్‌ ధరలు భారీగానే ఉంటాయి. దీంతో ఈ ప్రాంతం బడా బాబులకు ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా ఉంటోంది.