Aadhaar link with Mobile : ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు లేనిది ఏ పని జరగదు. బర్త్ డే సర్టిఫికెట్ నుంచి ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కంపల్సరీ. ఒక వ్యక్తిని గుర్తించడానిక ఆధార్ నెంబర్ తప్పనిసరి. 2023 సెప్టెంబర్ 29 ప్రకారం దేశంలో 138.08 కోట్ల మంది ఆధార్ కార్డులను కలిగి ఉన్నారు. ఇంకో దాదాపు 10 కోట్ల మంది ఆధార్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆధార్ ఎనరోల్ మెంట్ చేసుకోవడానికి ఒకప్పుడు గడువు విధించారు. కానీ ప్రస్తుతం పుట్టిన బిడ్డ నుంచి ఆధార్ నెంబర్ నమోదు చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్ నమోదు చేసుకునే సమయంలో ఒక వ్యక్తి పూర్తి వివరాలను నమోదు చేస్తారు. అలాగే అతని మొబైల్ నెంబర్ ను కూడా యాడ్ చేస్తారు. ఆధార్ నెంబర్ ఎక్కడ ఉపయోగించినా మొబైల్ కు మెసేజ్ వస్తుంది. అయితే ఒక ఆధార్ పై ఎన్ని మొబైల్ నెంబర్లు యాడ్ అయి ఉన్నాయి? వాటిని గుర్తించడం ఎలా?
ఆధార్ నెంబర్ కు మొబైల్ లింక్ చేయడం తప్పనిసరి. ఎందుకంటే ఏదైనా ముఖ్యపనిలో ఆధార్ ను ఉపయోగించేటప్పుడు ఆ వ్యక్తిని నిరూపించడానికి మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ నెంబర్ చెబితేనే ఆధార్ ను ధ్రువీకరించినట్లు. అందువల్ల ప్రతి ఒక్కరూ మొబైల్ నెంబర్ ను ఆధార్ కు లింక్ చేమమని ప్రభుత్వాలు కోరుతున్నాయి. అయితే ప్రస్తుతం కాలంలో డబ్బు వ్యవహారంలో కూడా ఆధార్ నెంబర్ ముఖ్యమైనదిగా మారింది. ఆధార్ నెంబర్ తో డబ్బులు డ్రా చేసుకునే అవకాశం వచ్చింది. దీంతో కొందరు ఒక వ్యక్తి ఆధార్ నెంబర్ పై మరో వ్యక్తిమొబైల్ నెంబర్ ను యాడ్ చేసుకుంటున్నారు. దీంతో నిజమైన వ్యక్తి నష్టపోతున్నారు. మరి ఇలాంటప్పుడు ఆధార్ నెంబర్ పై ఎన్ని మొబైల్ నెంబర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి.
ఒక ఆధార్ నెంబర్ పై ఎన్ని మొబైల్ నెంబర్లు ఉన్నాయో చిన్న ట్రిక్ ద్వారా తెలుసుకోవచ్చు. ముందుగా గూగుల్ లోకి వెళ్లి UIDAI అని టైప్ చేయాలి. ఆ తరువాత మొదటగా వచ్చిన లింక్ పై క్లిక్ చేయాలి.ఆ తరువాత ఆధార్ కు సంబంధించిన పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఆప్షన్లు అడిగిన చోట ఎంటర్ చేయాలి. అప్పుడు ఆధార్ కు సంబంధిత మొబైల్ నెంబర్ ఉంటే వెంటనే మెసేజ్ వస్తుంది. లేకుంటే రాదు. ఒకవేళ లేనట్లు గుర్తిస్తే వెంటనే మీ సేవ కార్యాలయంలోకి వెళ్లి ఆధార్ తో మొబైల్ నెంబర్ లిక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆధార్ తో ఏవైనా ముఖ్యమైన పనుులు చేసినప్పుడు ఆధార్ ధ్రువీకరణ కోసం మొబైల్ కు ఓటీపీ వస్తుంది. అందువల్ల ఆధార్ తో మొబైల్ నెంబర్ ను వెంటనే లింక్ చేసుకోవాలి. లేకుంటే అత్యవసర సమయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ఒకరి ఆధార్ తో మరొకరి మొబైల్ నెంబర్ యాడ్ అయిందా? లేదా? అనేది కూడా తెలుసుకోవాలి. లేకుంటే మనీట్రాన్స్ ఫర్ విషయంలో వేరొకరి మొబైల్ ఉంటే డబ్బులు దోచుకునే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Linked aadhaar with mobile otherwise this is what happens
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com