Vaishnavi Chaitanya : షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించి, ఆ పాపులారిటీ తోనే సినిమాల్లో అవకాశాలు పొంది మంచి సక్సెస్ లను చూసిన హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya). ఈమె ‘బేబీ’ సినిమా ద్వారానే మన అందరికీ తెలుసు. కానీ అంతకు ముందు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది. ఇక బేబీ సినిమా అయితే ఈమె కారణంగానే అంత పెద్ద హిట్ అయ్యిందని అందరూ అంటుంటారు. ఈ చిత్రం తర్వాత ఆమె ‘లవ్ మీ ఇఫ్ యు డేర్’ అనే చిత్రం చేసింది. కమర్షియల్ గా ఆ చిత్రం పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఆమె సిద్దు జొన్నలగడ్డ(Siddhu
Also Read : ‘పెద్ది’ టీజర్ వచ్చేసింది..ఫస్ట్ షాట్ సిక్సర్..లాస్ట్ షాట్ అరాచకం!
ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ లో హీరో సిద్దు, హీరోయిన్ వైష్ణవి చైతన్య ఫుల్ బిజీ గా ఉన్నారు. రీసెంట్ గానే వీళ్లిద్దరు ఒక కాలేజ్ లో ఈవెంట్ ని ఏర్పాటు చేసి, అక్కడి స్టూడెంట్స్ తో ముచ్చటించారు. ఈ ఈవెంట్ లో వైష్ణవి చైతన్య నోరు జారడం హైలైట్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘మా జాక్ సినిమా ఈ నెల 10న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మా ఎనర్జీ ని మీ రాజమండ్రి తో షేర్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చింది. అప్పుడు వెంటనే సిద్దు వైష్ణవి వద్దకు వచ్చి ‘ఇది రాజమండ్రి కాదు’ అనగానే, వైష్ణవి రియాక్షన్ ‘ఓ..F***’ అని అంటుంది. ఆ తర్వాత ఆమె దానిని కవర్ చేస్తూ ‘నేను ఎందుకు తడబడ్డాను అంటే, ఇంతకు ముందే అక్కడికి వెళ్లి, ఇక్కడికి వచ్చాము కాబట్టి కాస్త కన్ఫ్యూజ్ అయ్యాను’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘దయచేసి నన్ను క్షమించండి..చూసారా మీ ఎనర్జీ కి నేను ఎక్కడికి వచ్చానో కూడా మర్చిపోతున్నాను’ అంటూ కవర్ చేసింది. ఏప్రిల్ 10న మా జాక్ సినిమా వస్తుందని, సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు మొత్తం ఫన్ యాంగిల్ లోనే ఉంటుందని, కచ్చితంగా మీరందరు ఎంజాయ్ చేస్తారని చెప్పుకొచ్చింది. గత రెండు మూడు రోజులుగా అలేఖ్య చిట్టి భూతులే సోషల్ మీడియా ని ఏలుతున్నాయి. ఇవి పూర్తి గా మరిచిపోకముందే వైష్ణవి F పదం ఉపయోగించి మరో బూతు పదాన్ని ట్రెండింగ్ లోకి తెచ్చేసింది. సోషల్ మీడియా లో ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. ఇకపోతే జాక్ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. ఇప్పటి వరకు కేవలం లవ్ స్టోరీస్ తోనే తన కెరీర్ ని నెట్టుకొచ్చిన భాస్కర్, మొట్టమొదటిసారి యాక్షన్ కామ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ జానర్ లో ఒక సినిమాని తీయడం నిజంగా సర్ప్రైజ్ అని చెప్పొచ్చు.