Peddi Movie Teaser: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన మొదటి టీజర్ కాసేపటి క్రితమే విడుదలై సెన్సేషనల్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ‘గేమ్ చేంజర్’ చిత్రం పెద్ద ఫ్లాప్ అవ్వడంతో అభిమానులంతా చాలా డల్ ఫేస్ లోకి వెళ్లిపోయారు. సుమారుగా మూడేళ్లు కష్టపడి చేసిన చిత్రం ఇలా అయ్యిందే అని అభిమానులు ఇప్పటికీ ఆ సినిమా ఇచ్చిన స్ట్రోక్ నుండి తేరుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో విడుదలైన ఈ ‘పెద్ది’ టీజర్ అభిమానులకు రామ్ చరణ్ త్వరలో భారీ కం బ్యాక్ ఇవ్వబోతున్నాడు అని అర్థం అయిపోయింది. రామ్ చరణ్ నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ట్రోల్ చేయడానికి రెడీ గా ఉండే దురాభిమానుల అయితే ఈ టీజర్ ని చూసిన తర్వాత సైలెంట్ అయిపోయారు. రామ్ చరణ్ చెప్పిన ఉత్తరాంధ్ర యాస డైలాగ్స్ కూడా బాగా పేలాయి.
Also Read: అప్పట్లో పవన్ టైటిల్ తో ఉదయ్ కిరణ్ సినిమా..ఇండస్ట్రీ హిట్ చేజారిపోయింది
‘ఒకే పని చేసేదానికి..ఒకేలా బ్రతికేదానికి ఇంత పెద్ద బ్రతుకెందుకు..ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి’ అంటూ ఉత్తరాంధ్ర యాసలో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. సాధారణంగా ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్స్ చెప్పడానికి ప్రతీ హీరో తడబడుతాడు. నేటివిటీ కి దూరంగానే ఆ డైలాగ్ డెలివరీ ఉన్నట్టుగా అనిపిస్తాది. కానీ రామ్ చరణ్ ఈ సినిమా విషయంలో, ముఖ్యంగా యాస విషయం లో చాలా హోమ్ వర్క్ చేసినట్టుగా అనిపించింది.ప్రతీ షాట్ లో ఆయన ఎంతో ఎనర్జీ పెట్టి చేసినట్టుగా అనిపించింది. రామ్ చరణ్ లుక్స్ కూడా ఈ టీజర్ లో అదిరిపోయాయి. ఓవరాల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సినిమాతో మెగా అభిమానుల ఆకలి మొత్తం తీరబోతుంది అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 27 న విడుదల చేయబోతున్నట్టు టీజర్ చివర్లో చెప్పుకొచ్చారు.
మార్చి 27 న రామ్ చరణ్ పుట్టినరోజు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. పుట్టినరోజు నాడు ఈ సినిమా విడుదల అవుతుంది కాబట్టి, రామ్ చరణ్ నుండి అభిమానులకు జీవితంలో మర్చిపోలేని బహుమతి రాబోతుంది అంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. #RRR మూవీ తర్వాత రామ్ చరణ్ పై నరదిష్ఠి మామూలు రేంజ్ లో పడలేదని, ‘గేమ్ చేంజర్’ చిత్రం తో ఆ నరదిష్ఠి మొత్తం పోయిందని, ఇక నుండి విడుదల అవ్వబోయే ప్రతీ షాట్ (మూవీ) సిక్సర్ గానే ఉంటుందని అంటున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా, త్వరలోనే కొత్త షెడ్యూల్ ని మొదలు పెట్టుకోనుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని వండర్స్ ని క్రియేట్ చేయబోతుంది అనేది.