KGF Krishna Ji: కేజీఎఫ్ లో కన్పించిన ‘తాత’.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే అవాక్కాల్సిందే..!

KGF thatha Krishna Ji Background: హీరో యశ్ నటించిన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ అందరి అంచనాలను నిజం చేస్తూ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటికే వెయ్యి కోట్ల మార్క్ దాటేసిన కేజీఎఫ్ చాప్టర్ 2 ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్లను వెనక్కి నెట్టేలా ముందుకు దూసుకెళుతోంది. కేజీఎఫ్ మొదటి పార్ట్ సృష్టించిన సంచలనంతో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ మూవీని చూసేందుకు […]

Written By: NARESH, Updated On : April 26, 2022 3:11 pm
Follow us on

KGF thatha Krishna Ji Background: హీరో యశ్ నటించిన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ అందరి అంచనాలను నిజం చేస్తూ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటికే వెయ్యి కోట్ల మార్క్ దాటేసిన కేజీఎఫ్ చాప్టర్ 2 ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్లను వెనక్కి నెట్టేలా ముందుకు దూసుకెళుతోంది.

Krishna Ji

కేజీఎఫ్ మొదటి పార్ట్ సృష్టించిన సంచలనంతో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ మూవీని చూసేందుకు అభిమానులు తొలి రోజు నుంచి థియేటర్లకు పరుగులు పెట్టారు. వారి అంచనాలను అందని రీతిలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’ సిక్వెల్ ను తెరకెక్కించారు. దీంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది.

‘కేజీఎఫ్ చాప్టర్ 2’ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించిన వారి వివరాలను తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. యశ్(రాఖీబాయ్) తల్లి పాత్రలో నటించిన అర్చన జోయిస్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఆమె ఇంటర్వ్యూల కోసం ప్రముఖ ఛానల్స్ అన్ని కూడా అర్చన ఇంటి ముందు క్యూ కడుతున్నాయి.

అలాగే ఈ మూవీలో అంధుడి పాత్రలో కన్పించిన తాత గురించి తెలుసుకునేందుకు అభిమానులు గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఆ తాత పుట్టుపుర్వతోత్తరాలు, వృత్తి తదితర విషయాలను తెలుసుకొని అంతా అవాక్కవుతున్నారు. ఇంతకీ ఆ తాత రియల్ లైఫ్ లో ఏం చేస్తారనే కాదా మీ సందేహం.. ఆ విశేషాన్ని మీకోసం..

Also Read: Acharya: ఆచార్య సినిమా అనుకున్న సమయానికి వస్తుందా.. ఇప్పటికి ఎంతో బాలన్స్ ఉన్న వర్క్

కేజీఎఫ్ లో అంధుడి పాత్రలో నటించిన తాత పేరు కృష్ణాజీ. ఆయన ఆంధ్ర–కర్ణాటక స‌రిహ‌ద్దు ప్రాంతానికి చెందిన వారు. కృష్ణాజీ చిన్ననాటి నుంచే ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలు చూస్తూ ఈ రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. సినిమాల్లోకి రావడానికి అవసరమైన శిక్ష‌ణ కూడా తీసుకున్నారు.

ఈక్రమంలోనే సినిమా వాళ్లకు దుస్తులు కుట్టిన ఆయ‌న‌కు భీమ్ వెంకటేష్ అనే హీరో కమ్ ప్రొడ్యూసర్ తో కృష్ణాజీకి పరిచయం ఏర్పడింది. దీంతో ఆయన వద్ద కొంతకాలం ద‌గ్గ‌ర ప‌ని చేశారు. ఆ తర్వాత కమల్ హాసన్ మేకప్ బాయ్ తో పరిచయం ఏర్పడగా ఆయన వద్ద కూడా టచప్ బాయ్ గా కృష్ణాజీ పనిచేశాడు.

ఆ తర్వాత శంకర్ నాగ్ దగ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా చేరాడు. ఈ సమయంలోనే కృష్ణాజీకి కేజీఎఫ్ లో నటించే అవకాశం దక్కింది. ఈ చాన్స్ ను కృష్ణాజీ అద్భుతంగా వాడుకున్నాడు. అంధుడి పాత్ర‌లో ఒదిగిపోయి ప్ర‌తీ ఒక్క‌రి ప్ర‌శంస‌లను దక్కించుకున్నాడు.

ఇక ఈ కథలో అందరూ మెచ్చుకునే పాత్ర మరొకటి ఉంది. అదే ఇనాయత్ ఖలీల్ పాత్ర. కథని మలుపు తిప్పే ఈ పాత్రలో నటించింది మన టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ నటుడి తండ్రే. నటుడు ఆదర్శ్ బాలకృష్ణ తండ్రి బాలకృష్ణ నీలకంఠాపురం కేజీఎఫ్ 2లో ఇనాయత్ ఖలీల్ పాత్రలో నటించి అందరిని మెస్మరైజ్ చేశాడు. ఆదర్శ్ బాలకృష్ణ తండ్రి ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ నటించకపోవడం గమనార్హం.

Also Read: Suma: రాజీవ్ కనకాలతో గొడవలు నిజమే.. సుమ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Recommended Videos: