Ustad Bhagat Singh : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ప్రస్తుతం బ్యాలన్స్ ఉన్నటువంటి తన మూడు సినిమాలను పూర్తి చేసే పనిలో పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆయన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రాన్ని పూర్తి చేసాడు. వచ్చే నెల 12 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. నిన్న రాత్రి నుండి ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ని కూడా మొదలు పెట్టేసారు. ప్రస్తుతం ఆయన ‘ఓజీ'(They Call Him OG) మూవీ షూటింగ్ ని పూర్తి చేసే పనిలో పడ్డాడు. హైదరాబాద్ లో ఒక నాలుగు రోజుల పాటు జరిగిన షెడ్యూల్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్, ఈ నెల 27 నుండి ముంబై షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. మూవీ టీం రేపు ముంబై లో ఇతర తారాగణం పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనుంది. జూన్ 10 లోపు ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడు పవన్ కళ్యాణ్.
ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వగానే ఆయన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. గబ్బర్ సింగ్ లాంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్(Harish Shankar) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇది. మొదట్లో ఈ సినిమా పై అంచనాలు పీక్ రేంజ్ లో ఉండేవి. కానీ ఎప్పుడైతే తేరి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది అనే వార్త బయటకు వచ్చిందో, అప్పటి నుండి ఈ సినిమా పై పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనే నెగటివిటీ ఏర్పడింది. మొదట్లో ఉన్న అంచనాలు ఇప్పుడు అసలు లేవు. అయితే మారుతున్న ట్రెండ్ ని బాగా గమనించిన పవన్ కళ్యాణ్, ఇక మీదట రీమేక్ సినిమాలు చేయకూడదని బలంగా ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగా ఆయన ఈ సినిమా స్క్రిప్ట్ ని మొత్తాన్ని మార్చమని డైరెక్టర్ హరీష్ శంకర్ కి చెప్పాడట.
Also Read : ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ లో భారీ మార్పులు చేస్తున్న హరీష్ శంకర్ మళ్ళీ రీ షూట్ చేస్తారా..?
దీంతో హరీష్ శంకర్ సుమారుగా ఆరు నెలల పాటు సరికొత్త స్క్రిప్ట్ పై వర్క్ చేసి, ఇప్పుడు షూటింగ్ కి సిద్ధం అవ్వబోతున్నాడు. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ కాదు, ఫ్రెష్ సబ్జెక్టు అట. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో హీరోయిన్ గా శ్రీలీల(Sreeleela) ఎంపికైన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, శ్రీలీల కాంబినేషన్ లో రెండు మూడు సన్నివేశాలను కూడా తెరకెక్కించారు. అయితే ఇప్పుడు హరీష్ శంకర్ కొత్త స్క్రిప్ట్ కి అనుగుణంగా ఉండే హీరోయిన్ కోసం చూస్తున్నాడట. అందుకోసం శ్రీలీల ని ఈ చిత్రం నుండి తప్పించి ‘మిస్టర్ బచ్చన్’ హీరోయిన్ భాగ్యశ్రీ భొర్సే(Bhagyasri Bhorse) ని తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు. మరి దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. నిన్ననే హరీష్ శంకర్ షూటింగ్ కార్యక్రమాలు త్వరలో మొదలు కాబోతున్నాయి అంటూ సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన చేసాడు. వచ్చే నెలలో హీరోయిన్ కి సంబంధించిన అప్డేట్ బయటకి రావొచ్చు.