Pooran IPL History: ఐపీఎల్ లో మ్యాచ్ స్వరూపం నిమిష నిమిషానికి మారిపోతూ ఉంటుంది. అందువల్లే ఆటగాళ్ల స్థిరమైన ప్రదర్శన పై ఎవరూ ఒక అంచనా కు రాలేరు. కాకపోతే కొంతమంది ప్లేయర్లు మాత్రం చెప్పి మరీ వికెట్లు పడగొడతారు. చెప్పి మరీ పరుగుల వరద పారిస్తుంటారు. ఈ జాబితాలో లక్నో ఆటగాడు నికోలస్ పూరన్ ముందు వరసలో ఉంటాడు. గతంలో తన ప్రత్యర్థి బౌలర్ల పై పూరన్ పెను విధ్వంసం సృష్టించాడు. చెప్పి మరీ పరుగుల వరద పారించాడు. గురువారం గుజరాత్ తో తలపడిన సందర్భంగా అతడు హాఫ్ సెంచరీ తో అదరగొట్టాడు. ముఖ్యంగా సాయి కిషోర్ బౌలింగ్లో 14.3 ఓవర్ లో సింగిల్ తీసే అవకాశం ఉన్నప్పటికీ.. పరుగు తీయడానికి ఇష్టపడలేదు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ కావడంతో భారీ షాట్ ఆడేందుకు అతడు పరుగు తీయలేదు. ఇక ఆ తదుపరి బంతిని సిక్సర్ కొట్టాడు. పూరన్ చెప్పి మరీ సిక్సర్ కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ లో ఇలా చెప్పి మరీ సిక్సర్ కొట్టి అరుదైన ఘనత సాధించాడు.
పూరన్ విధ్వంసకరమైన ఆటగాడు. అదే స్థాయిలో బౌలింగ్ కూడా వేస్తాడు.. లక్నో జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.. వచ్చీ రాగానే విధ్వంసాన్ని మొదలుపెట్టే అతడు.. చివరి వరకు అదే ధోరణి కొనసాగిస్తాడు. బౌలర్ ఎవరనేది లెక్క పెట్టాడు. పిచ్ ఎలాంటిదనేది పరిగణలోకి తీసుకోడు. అందువల్లే అతడిని లక్నో జట్టు కొనుగోలు చేసింది. కొన్ని సందర్భాల్లో విఫలమైనప్పటికీ.. చాలా సందర్భాల్లో అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడతాడు. అందువల్లే అతడిని మ్యాచ్ విన్నర్ అని పిలుస్తుంటారు. టి20 ఫార్మేట్ లో అద్భుతమైన రికార్డులను పూరన్ సొంతం చేసుకున్నాడు. అందువల్లే అతని లక్నో జట్టు ఏరికోరి కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్లో లక్నో జట్టు అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. తన చివరి మ్యాచ్లో మాత్రం ఘనవిజయం సాధించింది. విజయం ద్వారా లీగ్ దశను ముగించింది. ఈ సీజన్లో లక్నో జట్టుపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.
లక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఆశించినత స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయాడు. సారధిగా కూడా అతడు విఫలమయ్యాడు. అందువల్లే లక్నో జట్టు ఈ స్థాయిలో ఓటములను ఎదుర్కొంది. వాస్తవానికి జట్టులో ఉన్న ప్లేయర్ల పరంగా చూసుకుంటే లక్నో జట్టు కచ్చితంగా ట్రోఫీని అందుకునే జట్ల జాబితాలో ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఆటగాళ్ల మధ్య సరైన బాండింగ్ లేకపోవడంతో లక్నో జట్టు ఓటములు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఇటీవల హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయిన లక్నో.. ఆ తర్వాత ఒక్క రోజు గ్యాప్ లోనే విజయాన్ని సాధించింది. టేబుల్ టాపర్ గా ఉన్న గుజరాత్ జట్టుపై అద్భుతమైన గెలుపును సొంతం చేసుకుంది. మొత్తంగా ఈ టోర్నీలో ముందుగానే ప్లే ఆఫ్ అవకాశాలను దూరం చేసుకున్నప్పటికీ.. గ్రూప్ దశను విజయంతో ముగించింది.