https://oktelugu.com/

Ustad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ లో భారీ మార్పులు చేస్తున్న హరీష్ శంకర్ మళ్ళీ రీ షూట్ చేస్తారా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళను వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా మార్చుకున్నారు. నిజానికి రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సైతం తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఆయన తర్వాత కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో హరీష్ శంకర్ ఒకరు...ఇక రీసెంట్ గా ఆయన చేసిన మిస్టర్ బచ్చన్ సినిమా ప్లాప్ అయింది...

Written By:
  • Gopi
  • , Updated On : November 4, 2024 / 01:55 PM IST

    Will Harish Shankar, who is making huge changes in Ustad Bhagat Singh's story, re-shoot again..?

    Follow us on

    Ustad Bhagat Singh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు హరీష్ శంకర్… మిరపకాయ్ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న ఆయన పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటితో ని కూడా క్రియేట్ చేసుకున్నాడు… ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ గబ్బర్ సింగ్ సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో నటించాడానికి చాలా వరకు ఉత్సాహం చూపించారు. కానీ అలాంటి హరీష్ శంకర్ ప్రస్తుతం తన ఫామ్ ను ఏ మాత్రం అందుకోకుండా రెగ్యూలర్ కమర్షియల్ సినిమాలను చేయడానికి అలవాటు పడ్డాడు. దానివల్ల ఆయన పేరు అయితే భారీగా డ్యామేజ్ అయిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇదిలా ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్టోరీలో ప్రస్తుతం మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ ఈ కథలో కొన్ని మార్పులను చెప్పారట. ఇక దానికి తగ్గట్టుగానే హరీష్ శంకర్ కూడా ఈ మార్పులకు అంగీకరించి సినిమాలో కొన్ని మార్పులను చేసి భారీ ట్విస్ట్ లను ఆడ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది.

    మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ కు తగ్గట్టుగానే ఈ కథ ఉంటుందా? లేదా అనే కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమా తమిళంలో వచ్చిన విజయ్ తేరి సినిమాకి రీమేక్ గా వస్తుందా? లేదంటే ఒరిజినల్ కథతో వస్తుందా? అనే విషయాల పట్ల సరైన అవగాహన లేదు…

    కానీ ఏది ఎలా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ రేంజ్ కి తగ్గట్టుగా కథ ఉంటే మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధిస్తుంది.
    అలా కాకుండా రెగ్యూలర్ ఫార్మాట్ లో ఉంటే మాత్రం ఈ సినిమాని ఎవరు కాపాడలేరు అంటూ చాలామంది సిని మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేయడం విశేషం…

    ఇక మొత్తానికైతే హరీష్ శంకర్ తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…