Ustad Bhagat Singh First Review: సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఇక్కడ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని వచ్చిన కూడా భరిస్తూ అవకాశాల కోసం ఓపికతో ఎదురుచూసిన వాళ్లకు మాత్రమే సూపర్ సక్సెసులైతే దక్కుతాయి. మొదట వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చిన్న చిన్న మెట్లు ఎక్కుతూ పైకి ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన ఇండస్ట్రీలో సక్సెస్ అవుతాము అనేది సరైనది కాదు. ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి స్వశక్తితో వచ్చి సక్సెస్ అయ్యాడు. తన తమ్ముడిగా ఇండస్ట్రీ కి వచ్చిన పవన్ కళ్యాణ్ సైతం కెరియర్ స్టార్టింగ్ లో చేసిన సినిమాలతో భారీ విజయాలను సాధించాడు. వరుసగా ఏడు సక్సెస్ లను సాధించి తెలుగు సినిమా ఇండస్ట్రిలో స్టార్ హీరోగా అవతరించాడు. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాలతో ఫ్లాప్ లను మూట గట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించి నట్టుగా తెలుస్తుంది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో అన్యాయాన్ని ఎదిరించే ఒక పాత్రలో తన నటన బాగుందని సినిమాను చూసిన కొంతమంది సినిమా సెలబ్రిటీస్ చెబుతున్నారు. గబ్బర్ సింగ్ సినిమాలో ఎలాంటి పవర్ ఫుల్ రోల్ లో నటించాడో ఈ సినిమాలో కూడా అంతకు మించిన పాత్రనైతే పోషిస్తున్నాడట.
ఒక ఊరిలో ఒక కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఎదిరించే ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో తను కనిపించబోతున్నాడు. దానికోసం ఆయన ఎక్కడి దాకా వెళ్ళాడు అనేది ఈ సినిమా స్టోరీ గా తెలుస్తుంది. ఇక ఫస్ట్ రివ్యూ లో ఈ సినిమా అద్భుతంగా ఉందనే కామెంట్లయితే వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మరోసారి ఈ సంవత్సరం కూడా తన సత్తా చాటబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర కూడా సినిమాకి చాలా వరకు హెల్ప్ అయ్యే విధంగా ఉంటుందని ఈ సినిమాను చూసిన కొంతమంది సినిమా మేధావులైతే చెబుతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు చాలా వరకు ప్లస్ అవుతుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ లో కూడా దేవి తన సత్తా చాటినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ‘ఓజీ’ ని మించి సూపర్ సక్సెస్ సాధిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…