Homeఎంటర్టైన్మెంట్Harish Shankar Upcoming Movie: హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ తో హిట్ కొడితే ఆ...

Harish Shankar Upcoming Movie: హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ తో హిట్ కొడితే ఆ ముగ్గురు హీరోలతో సినిమా చేసే ఛాన్స్ వస్తుందా..?

Harish Shankar Upcoming Movie: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది అంత ఆషామాషీగా రాదు. దానికోసం అహర్నిశలు కష్టపడాలి. రాత్రి పగలు తేడా లేకుండా సినిమా కోసమే ఆలోచిస్తూ ఉండాలి. అలాంటి వాళ్లకు మాత్రమే ఇండస్ట్రీలో సక్సెస్ లు వస్తాయి. ఇక హరీష్ శంకర్ లాంటి దర్శకుడు సైతం కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు… పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు రికార్డులను సృష్టించాడు. పవన్ కళ్యాణ్ కి పది సంవత్సరాల తర్వాత సాలిడ్ హిట్ ని అందించిన ఘనత కూడా తనకే దక్కింది. ఇక అలాంటి హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు…ఇక ఇంతకుముందు రవితేజతో చేసిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే ఒక ధృడ సంకల్పంతో హరీష్ శంకర్ ముందుకు సాగుతున్నాడు. నిజానికి పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఈ సినిమా విజయాన్ని సాధిస్తే అతనికి బాలీవుడ్ లో ఉన్న ముగ్గురు స్టార్ డైరెక్టర్లను కలిపి ఒక మల్టీస్టారర్ సినిమా చేసే అవకాశమైతే దక్కుతుంది…

సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అజయ్ దేవగన్ ముగ్గురూ కలిసి ఒక సినిమా చేయాలని అనుకుంటున్నారట. అది కమర్షియల్ జానర్ లో ఉంటే చాలా మంచిదని ప్రేక్షకులందరు కూడా ఇప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన సినిమాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని వాళ్ళు భావిస్తున్నారట.

దానికోసం తెలుగు సినిమా దర్శకుడు అయిన హరీష్ శంకర్ ని ఎంచుకుంటే బాగుంటుందని వాళ్లు భావిస్తున్నారు. అయితే హరీష్ శంకర్ సక్సెస్ సాధిస్తేనే తనకు ప్రాజెక్టు దక్కే అవకాశాలైతే ఉన్నాయి.

ఎందుకంటే వాళ్ళు సక్సెస్ ఫుల్ డైరెక్టర్లతో సినిమా చేయాలని అనుకుంటున్నారు. ప్లాప్ ల్లో ఉంటే దర్శకుడికి పెద్దగా మార్కెట్ ఉండదు.అలాగే అతని మీద భారీ హైప్ కూడా క్రియేట్ అవ్వదు. కాబట్టి తను ఒక సక్సెస్ ఫుల్ సినిమా చేసి వస్తే అతనితో సినిమా చేయడానికి మేము రెడీగా ఉన్నామంటూ వాళ్ళు ముగ్గురు హీరోలు హరీష్ శంకర్ కి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular