Homeఎంటర్టైన్మెంట్Akhil Akkineni: అఖిల్ లెనిన్ తో హిట్ కొడితే బాలయ్య మీద ప్రేజర్ పెరుగుతుంది...కారణం ఇదే...

Akhil Akkineni: అఖిల్ లెనిన్ తో హిట్ కొడితే బాలయ్య మీద ప్రేజర్ పెరుగుతుంది…కారణం ఇదే…

Akhil Akkineni: మొత్తానికైతే అక్కినేని అఖిల్ ‘లెనిన్’ సినిమాతో సక్సెస్ ని సాధించాడు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటివరకు ఒక్క సక్సెస్ ని సాధించకపోవడంతో అక్కినేని అభిమానులు సైతం తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా నాగార్జున సైతం తన కొడుకు హీరోగా పనికిరాడేమో అనే ఒక చిన్నపాటి డైలమాలో పడిపోయాడు. ఎట్టకేలకు ఈ సినిమా అఖిల్ కెరియర్ లోనే సూపర్ సక్సెస్ గా నిలవడమే కాకుండా అతని నటనలో కూడా వైవిధ్యాన్ని చూపించి మెప్పించాడు. అలాగే అక్కినేని అభిమానులు సైతం అతని మీద ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే లెనిన్ సినిమా సక్సెస్ అయిన తర్వాత బాలయ్య బాబు మీద ప్రెషర్ పెరుగుతుంది. కారణం ఏంటంటే తన కొడుకు అయిన మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయాల్సిన బాధ్యత బాలయ్య బాబు మీద ఉంది. నందమూరి అభిమానులు సైతం చాలా సంవత్సరాల నుంచి అతని ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు. అయినప్పటికి ఆయన ఎప్పుడు ఇండస్ట్రీకి వస్తాడు ఎప్పుడు సినిమా చేస్తాడు అనే విషయం మీద సరైన క్లారిటీ లేదు.

మొన్నటి దాకా అక్కినేని హీరోలు స్టార్ హీరోల రేసు లో లేరని అందరు అనుకున్నారు. కానీ అఖిల్ ఒకసారి సూపర్ సక్సెస్ సాధించడంతో తను స్టార్ హీరోల రేసులోకి దూసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు బాలయ్య బాబు కొడుకు కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించి అతను కూడా స్టార్ హీరో లిస్టులో చేరిపోవాడానికి చాలా రకాల కసరత్తులైతే చేయాలి. ఎట్టకేలకు అక్కినేని ఫ్యామిలీకి సక్సెస్ వచ్చింది కాబట్టి బాలయ్య బాబు మీద తన అభిమానులు సైతం ప్రెజర్ అయితే పెడుతున్నారు.

ఇక ఈ క్రమంలోనే బాలయ్య తన కొడుకును 2027 వ సంవత్సరంలోనైనా ఇంట్రడ్యూస్ చేస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ప్రస్తుతం బాలయ్య బాబు ఆ పనిలోనే బిజీగా ఉన్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేసే దర్శకుడు ఎవరు అనేదానిమీద ఇంకా సరైన క్లారిటి రాలేదు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version