Homeఅంతర్జాతీయంHormuz Strait: హర్మూజ్‌ గండం గట్టెక్కేలా.. గల్ఫ్‌ దేశాల కొత్త రవాణా వ్యూహాలు!

Hormuz Strait: హర్మూజ్‌ గండం గట్టెక్కేలా.. గల్ఫ్‌ దేశాల కొత్త రవాణా వ్యూహాలు!

Hormuz Strait: ప్రపంచ చమురు రవాణాలో హర్మూజ్‌ జలసంధి కీలక పోషిస్తోంది. ఇరాన్‌ భౌగోళిక స్థానంతో ఈ మార్గంపై ఉద్రిక్తతలు పెరిగినప్పుడు ప్రపంచ ఇంధన సరఫరాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఈ ప్రమాదాన్ని అర్థం చేసుకున్న గల్ఫ్‌ దేశాలు ఒకే సముద్ర మార్గంపై ఆధారపడకుండా వివిధ ప్రత్యామ్నాయాలను వేగంగా అభివృద్ధి చేస్తున్నాయి. పైపులైన్లు, కొత్త ఓడరేవులు, భూసంబంధ మార్గాలు వంటి ప్రాజెక్టులపై భారీ పెట్టుబడులు పెడుతున్నాయి.

హర్మూజ్‌ జలసంధి సవాళ్లు..
ఈ జలసంధి ద్వారా ప్రపంచ సముద్ర చమురు రవాణాలో పెద్ద విభాగం. ఇరాన్‌ ఆధిపత్యం వల్ల యుద్ధాలు లేదా ఉద్రిక్తతలు పెరిగినప్పుడు చమురు ధరలు పెరుగుతున్నాయి. సరఫరా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు గల్ఫ్‌ దేశాలు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఆసియా దేశాలకు ఎగుమతులు ఎక్కువగా ఉండటంతో, సురక్షితమైన, వేగవంతమైన మార్గాలు అవసరమని వారు భావిస్తున్నారు.

సౌదీ అరేబియా పైపులైన్‌..
సౌదీ అరేబియా ఇప్పటికే తన తూర్పు చమురు క్షేత్రాలను ఎర్ర సముద్రంలోని యన్బు ఓడరేవుతో అనుసంధానించే పైపులైన్‌ను ఉపయోగిస్తోంది. ఈ మార్గం సామర్థ్యాన్ని రోజుకు అదనంగా రెండు మిలియన్‌ బ్యారెళ్లకు పెంచే పనులు జరుగుతున్నాయి. అయితే ఆసియాకు ఎగుమతుల్లో ఎక్కువ భాగం ఉండటంతో, ఎర్ర సముద్రంలోని ఇతర సంకటాలు ఇంకా సవాల్‌గా మిగిలాయి. దీంతో మరింత సురక్షితమైన ఎంపికలను అన్వేషిస్తోంది.

యూఏఈ వ్యూహం ఇలా..
యూఏఈ హర్మూజ్‌కు ప్రత్యామ్నాయంగా అబుదాబి చమురు క్షేత్రాల నుంచి ఒమన్‌ గల్ఫ్‌లోని ఫుజైరా ఓడరేవుకు పైపులైన్‌ నిర్మించింది. ఈ మార్గం ఇప్పటికే పనిచేస్తోంది. దీని సామర్థ్యాన్ని రెట్టింపు చేసే రెండో పైపులైన్‌ను 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫుజైరాను ప్రధాన ఎగుమతి కేంద్రంగా మార్చేందుకు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ విధానం ద్వారా హర్మూజ్‌పై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుందని యూఏఈ భావిస్తోంది.

కువైట్, బహ్రెయిన్‌కు సవాళ్లు
కువైట్, బహ్రెయిన్‌ వంటి దేశాలకు హర్మూజ్‌ మూసివేత పెద్ద సంకటం. వాటి చమురు ఎగుమతులు దాదాపు పూర్తిగా హర్మూజ్‌ ] ూర్గంపై ఆధారపడి ఉన్నాయి. దీంతో సౌదీ అరేబియాలోని యన్బు ఓడరేవుతో కొత్త పైపులైన్‌ అనుసంధానం కోసం ప్రాజెక్టులను పరిశీలిస్తున్నాయి. అయితే ఈ పనులు పూర్తి కావడానికి కనీసం ఐదేళ్లు పట్టే అవకాశం ఉంది. ఇంతలో వారు తాత్కాలిక పరిష్కారాలను కూడా అన్వేషిస్తున్నారు.

రవాణా వ్యవస్థల అభివృద్ధి
చమురు మాత్రమే కాకుండా పారిశ్రామిక వస్తువుల ఎగుమతుల కోసం కూడా గల్ఫ్‌ దేశాలు భూమి మార్గాలపై దృష్టి సారిస్తున్నాయి. ఫుజైరా, యన్బు వంటి ఓడరేవులను రైల్వేలు, రోడ్లు, కంటైనర్‌ టెర్మినల్స్‌తో అనుసంధానించే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ విధానం ద్వారా సముద్ర మార్గాలపై ఆధారపడటం తగ్గి, మొత్తం రవాణా వ్యవస్థ మరింత సురక్షితంగా, వేగవంతంగా మారుతుంది.

ఇరాన్‌కు ప్రస్తుతం ఉన్న వ్యూహాత్మక ప్రయోజనం శాశ్వతం కాదు. కొత్త పైపులైన్లు, ఓడరేవులు, భూసంబంధ మార్గాలు పూర్తయ్యే కొద్దీ హర్మూజ్‌ ప్రభావం క్రమంగా తగ్గుతుంది. గల్ఫ్‌ దేశాలు నిర్మిస్తున్న ఈ ప్రత్యామ్నాయ వ్యవస్థలు ప్రపంచ ఇంధన సరఫరాలను మరింత స్థిరంగా, సురక్షితంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version