Ustaad Bhagat Singh Teaser Review: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ టీజర్ కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ ఈ నెల 10 న విడుదల అవ్వబోతుంది కాబట్టి, డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ టీజర్ కి ‘ట్రైలర్ టీజ్’ అని టైటిల్ పెట్టాడు. సినిమాలో అసలు విషయం ఉందా లేదా అనే భయం అభిమానుల్లో ఉండేది. కానీ టీజర్ చూసిన తర్వాత వారిలో ఒక నమ్మకం అయితే కలిగింది. ఈ చిత్రం ‘హరి హర వీరమల్లు ‘ లాగా తేడా అవ్వదు అని ఫ్యాన్స్ లో గట్టి నమ్మకం అయితే వచ్చింది. టీజర్ లో చూపించిన యాక్షన్ షాట్స్, ఎలివేషన్ షాట్స్ అదిరిపోయాయి. ఈ మాత్రం ఉంటే బాక్స్ ఆఫీస్ బద్దలు అని ఫ్యాన్స్ అంటున్నారు.
Also Read: మంచు విష్ణు ఆ ఒక్క సినిమా నాకోసం వదిలేయమని ప్రభాస్ ను అడిగాడా..? ఆ సినిమా ఏంటంటే..?
అంతా బాగానే ఉంది కానీ, ‘ఇందాక మీరు విన్నది భగవత్ గీత.. ఇది భగత్ గీత ..దమ్మున్నోడు దాటుచు ‘ అనే డైలాగ్ కి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది కానీ, న్యూట్రల్ ఆడియన్స్ నుండి మాత్రం కాస్త డివైడ్ రెస్పాన్స్ వస్తుంది. అయితే సినిమా లో అలా అది పర్ఫెక్ట్ గానే ఉంటుందని, సన్నివేశం సారాంశాన్ని భగవత్ గీత శ్లోకం లో చెప్పి, ఇది భగత్ గీత అని చెప్పి ఉంటె అదిరిపోతోంది, సినిమాలో అలాంటి సందర్భమే ఉండొచ్చని అంటున్నారు. ఇక ఈ టీజర్ కి థమన్ అందించిన మ్యూజిక్ పర్వాలేదు అనిపించింది .టీజర్ కట్ ఇంకా కాస్త పెద్దదిగా ఉండుంటే బాగుండేది , కానీ చాలా చిన్నగా కట్ చేసారు అంటూ కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ టీజర్ రీసెంట్ గా ఈ చిత్రం నుండి వచ్చిన కంటెంట్స్ అన్నిటికంటే బెటర్ గా ఉందని అంటున్నారు. మరి ట్రైలర్ కూడా ఇదే రేంజ్ లో ఉంటే పక్కాగా బ్లాస్టింగ్ రేంజ్ ఓపెనింగ్స్ వస్తాయని అంటున్నారు ఫ్యాన్స్ .
దమ్మునోడు దాటొచ్చు #UstaadBhagatSingh Trailer Tease out now!
▶️ https://t.co/mXLMZRfHSC#UBSTrailer out soon ❤#UstaadBhagatSingh GRAND RELEASE WORLDWIDE ON 19th MARCH, 2026.#UBSOnMarch19th pic.twitter.com/fCQWdj99sB— Ustaad Bhagat Singh (@UBSTheFilm) March 7, 2026