Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్ సింగ్' తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు...

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..రిస్క్ చేస్తున్న బయ్యర్స్!

Ustaad Bhagat Singh: ‘ఓజీ'(They Call Him OG) వంటి భారీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నుండి రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) పై అభిమానుల్లో ఇప్పుడిప్పుడే అంచనాలు పెరుగుతున్నాయి. మార్చి 26 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా గురించి మేకర్స్ ఎలాంటి చప్పుడు చేయకపోవడం, ప్రమోషనల్ కంటెంట్ ని విడుదల చేయకపోవడం వల్ల ఫ్యాన్స్ లో తీవ్రమైన నిరాశ ఎదురైంది. మేకర్స్ ని ట్యాగ్ చేసి ప్రతీ రోజు తిట్టడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. అ’యితే శివరాత్రి రోజున ఈ సినిమాలోని రెండవ సాంగ్ అప్డేట్ ని ప్రకటించారు. ఫిబ్రవరి 22 న ‘#TheAuraOfUstaad’ పాటని విడుదల చేయబోతున్నారట. పవన్ కళ్యాణ్ అభిమానులు కొన్నేళ్ల పాటు ఈ పాటని గుర్తించుకుంటారని, అంత అద్భుతంగా వచ్చిందని అంటున్నారు. ఆ రేంజ్ లో సాంగ్ ఉంటే మాత్రం ఈ చిత్రానికి ఓజీ రేంజ్ క్రేజ్ వస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని రీసెంట్ గానే రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రారంభించారు. నిర్మాతలు ఆంధ్ర ప్రాంతానికి (సీడెడ్ మినహా) 72 కోట్ల రూపాయలకు అడుగుతున్నారట. కానీ బయ్యర్స్ 60 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి సిద్ధం గా ఉన్నట్టు తెలుస్తోంది. బిజినెస్ క్లోజ్ అయ్యే సమయానికి 65 కోట్ల రూపాయిల వరకు ఉండొచ్చని అంచనా. అదే విధంగా సీడెడ్ ప్రాంతం హక్కులు, ఒక ప్రముఖ టాప్ నిర్మాత 18 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. కానీ మేకర్స్ మాత్రం 22 కోట్ల రూపాయిలు డిమాండ్ చేస్తున్నారు. చివరికి 20 కోట్ల రూపాయలకు రాబోయే రోజుల్లో ఫైనల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓవరాల్ గా ఆంధ్రా + సీడెడ్ కలిపి ఈ చిత్రానికి 85 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఇక నైజాం ప్రాంతం లో మైత్రీ మూవీ మేకర్స్ సొంతంగా విడుదల చేసుకుంటారు కాబట్టి, వేల్యూ బిజినెస్ దాదాపుగా 40 కోట్ల రూపాయిల వరకు జరగొచ్చని అంటున్నారు. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలకు ఈ చిత్రం బిజినెస్ 125 కోట్ల రూపాయలకు జరిగే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే విధంగా ఓవర్సీస్ ప్రాంతానికి గాను 10 కోట్ల రూపాయిలు, కర్ణాటక ప్రాంతానికి గాను 7 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగే అవకాశం ఉందని, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 142 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంటే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఈ చిత్రం 142 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలి. పాజిటివ్ టాక్ వస్తే కేవలం వీకెండ్ తోనే ఈ మార్కుని అందుకుంటారని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular