Ustaad Bhagat Singh Premiere Shows Cancelled: పవన్ కళ్యాణ్(deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ని ఒక్కొక్కటిగా వదులుతున్నారు. నిన్న రాత్రి ట్రైలర్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేయగా, దానికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండవ పాటని చూసి డీలాపడిన అభిమానులకు , ఈ ప్రోమో ఇచ్చిన జోష్ మామూలుది కాదు. అయితే ఇంతలోపే ఈ సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక చేదు వార్త ప్రచారం అవుతోంది. అదేమిటంటే , ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ ఉండవట. 19 వ తేదీ మిడ్ నైట్ షోస్ ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కుదిరితే మిడ్ నైట్ షోస్ , లేదంటే ఉదయం 5 గంటల నుండి షోస్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట.
Also Read: విజయ్-త్రిషల ప్రేమకి ‘విక్రమ్-జ్యోతిక’లే కారణమా? ఆసక్తికరమైన కథనం!
ఎందుకు ఈ ఆలోచన చేస్తున్నారు అనే దానిపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు కానీ , ‘ధురంధర్ 2 ‘ చిత్రం కారణంగానే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మార్చి 19 న విడుదల అవ్వబోయే ‘ధురంధర్ 2’ మూవీ ప్రీమియర్ కి ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షోస్ ప్లాన్ చేస్తున్నారు. అంటే మార్చి 18 న ఇండియా వైడ్ గా ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి. హైదరాబాద్ లో ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోస్ బుకింగ్స్ ని ప్రారంభించారు. మల్టీ ప్లెక్స్ షోస్ అన్నీ దాదాపుగా ఈ చిత్రానికే కేటాయించారు. మరో పక్క ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ప్రీమియర్ షోస్ ని మామూలు రేట్స్ లో ప్రదర్శించలేరు, కనీసం ఒక్కో టికెట్ ధర 600 రూపాయిలు ఉండాలి. ప్రస్తుతం తెలంగాణ లో హై కోర్టు అందుకు అనుమతించే అవకాశం కనిపించడం లేదు.
అందుకే హడావడిగా పోవడం కంటే, ధురంధర్ 2 తో ప్రీమియర్స్ క్లాష్ లేకుండా , అర్థ రాత్రి ఒంటిగంట నుండి బెనిఫిట్ షోస్ వేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నారట. కానీ రాబోయే రోజుల్లో ఏమైనా జరగొచ్చు. చివరి నిమిషం లో ప్రీమియర్ షోస్ కి వెళ్లినా వెళ్లొచ్చు అని అంటున్నారు విశ్లేషకులు. కానీ అభిమానులు మాత్రం ప్రీమియర్ షోస్ ఉండవు అనే వార్త తెలిసినప్పటి నుండి పూర్తిగా డీలా పడ్డారు. మన ఇండియా లో కంటే ఓవర్సీస్ లో ఇలాంటి కమర్షియల్ మూవీస్ కి టాక్ వచ్చే అవకాశాలు ఉండవని, అక్కడి ఆడియన్స్ ఇలాంటి సినిమాలకు డివైడ్ టాక్ చెప్తారని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది. హరి హర వీరమల్లు, ఓజీ చిత్రాలకు ప్రీమియర్ షోస్ నుండి వచ్చిన గ్రాస్ వసూళ్లు సాధారణమైనవి కాదు. ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ లేకపోతే ఆ గ్రాస్ మొత్తం కోల్పోయినట్టే.