Homeఎంటర్టైన్మెంట్Sharwanand: శర్వానంద్ మేకోవర్ లో ఓకే...మరి సక్సెసులు వస్తాయా..?

Sharwanand: శర్వానంద్ మేకోవర్ లో ఓకే…మరి సక్సెసులు వస్తాయా..?

Sharwanand: ఈ జనరేషన్ లో ఉన్న హీరోల్లో డెడికేషన్ తో వర్క్ చేసే నటులు చాలా తక్కువమంది ఉన్నారు. అందులో శర్వానంద్ ఒకరు.. కెరియర్ మొదట్లో ఎలాంటి పాత్రకైనా సరే తను సరిగ్గా సరిపోతాడు అనే పేరు తెచ్చుకున్నాడు. కానీ మధ్యలో అతనికి సరైన సక్సెస్ లు పడకపోవడంతో అతను మీడియం రేంజ్ హీరో గానే పేరు తెచ్చుకున్నాడు. తప్ప టాప్ రేంజ్ కి వెళ్లలేకపోయాడు. ఇక దానికి తోడుగా అతని స్క్రిప్ట్ సెలక్షన్ లో సైతం […]

Sharwanand: ఈ జనరేషన్ లో ఉన్న హీరోల్లో డెడికేషన్ తో వర్క్ చేసే నటులు చాలా తక్కువమంది ఉన్నారు. అందులో శర్వానంద్ ఒకరు.. కెరియర్ మొదట్లో ఎలాంటి పాత్రకైనా సరే తను సరిగ్గా సరిపోతాడు అనే పేరు తెచ్చుకున్నాడు. కానీ మధ్యలో అతనికి సరైన సక్సెస్ లు పడకపోవడంతో అతను మీడియం రేంజ్ హీరో గానే పేరు తెచ్చుకున్నాడు. తప్ప టాప్ రేంజ్ కి వెళ్లలేకపోయాడు. ఇక దానికి తోడుగా అతని స్క్రిప్ట్ సెలక్షన్ లో సైతం చాలా వరకు లోపాలైతే జరిగాయి. అందువల్లే ఆయన అనుకున్న గమ్య స్థానాన్ని చేరుకోలేకపోయాడు… ప్రస్తుతం ఆయన రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. రీసెంట్ గా ఈ సంవత్సరం నారీ నారీ నడుమ మురారి సినిమాతో సక్సెస్ సాధించిన ఆయన ‘బైకర్’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.

Also Read: విజయ్-త్రిషల ప్రేమకి ‘విక్రమ్-జ్యోతిక’లే కారణమా? ఆసక్తికరమైన కథనం!

ఇక ఈ సినిమాలో చాలా సన్నగా మారి తన బాడీని సైతం చాలా దృఢంగా మార్చుకున్నాడు. అలాంటి మేకోవర్ తో ప్రేక్షకులను రంజింప చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక దీనికి తోడుగా ‘సంపత్ నంది’ డైరెక్షన్ లో చేస్తున్న ‘భోగి’ సినిమాతో సైతం ఆయన మాస్ అవతారం ఎత్తాడు.

ఇక ఈ సినిమాలో కత్తి పట్టుకొని సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. తనలోని మాస్ యాంగిల్ ఏ రేంజ్ లో ఉంటుందో బయటికి తీయబోతున్నట్టుగా తెలుస్తుంది. సంపత్ నంది సైతం ఈ సినిమాని చాలా ఆసక్తిగా తెరకెక్కిస్తున్నాడట. ఎందుకంటే అతనికి కూడా ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ రావడం లేదు.

కాబట్టి ఎలాగైనా సరే ఈ సినిమాని టాప్ రేంజ్ లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో అతను వర్క్ చేస్తున్నాడట… మరి శర్వానంద్ మాస్ ఆడియన్స్ ని ఏ రకంగా మెప్పిస్తాడు అనేది తెలియాల్సి ఉంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్ లో శర్వానంద్ ఊర మాస్ గా కనిపిస్తున్నాడు.ఈ సినిమాతో ఆయన భారీ సక్సెస్ ని సాధించి టాప్ హీరోగా మారతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper