spot_img
Homeఎంటర్టైన్మెంట్Tollywood commercial movies trend: 'ఉస్తాద్ భగత్ సింగ్' తో టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాల...

Tollywood commercial movies trend: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాల ట్రెండ్ ముగిసినట్టే ..

Tollywood commercial movies trend: ఒకప్పుడు మన తెలుగు సినిమాకు కమర్షియల్ సినిమా అనేది వెన్నుముక లాంటిది. ముఖ్యంగా స్టార్ హీరోలు ఈ జానర్ లో సినిమాలు చేస్తే ఇండస్ట్రీ రికార్డ్స్ షేక్ అయ్యేవి. చిరంజీవి ని మెగాస్టార్ చేసింది, రజినీకాంత్ ని సూపర్ స్టార్ ని చేసింది ఈ కమర్షియల్ సినిమాలే. అలాంటి కమర్షియల్ సినిమాలు ‘జెన్ జీ’ ఆడియన్స్ కి అవుట్ డేటెడ్ జానర్ అయిపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ మొత్తం మీద ఓపెనింగ్స్ రాబట్టలేని సినిమా అంటూ ఏది లేదు. ఎంత పెద్ద డిజాస్టర్ సినిమాకు అయినా , కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ ని పెట్టడం ఆయన స్టైల్. అలాంటి పవర్ స్టార్ కి ఓపెనింగ్స్ ని తెచ్చి పెట్టలేని సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). రీసెంట్ గానే విడుదలైన ఈ సినిమాకు 6 రోజులకు కలిపి కేవలం 90 కోట్ల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు.

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో, మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ ని రాబట్టగల సత్తా ఉన్న హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన గత చిత్రం ‘ఓజీ’ ఏకంగా 154 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అలాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ సినిమాకు 6 రోజులు దాటినా 100 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టలేదంటే , ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. పోనీ సినిమా అత్యంత దారుణంగా ఉందా అంటే , అసలు లేదు, ‘హరి హర వీరమల్లు’ కంటే వెయ్యి రెట్లు బెటర్ సినిమా. అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి వసూళ్లు రావడం లేదంటే , అందుకు కారణం ఈ సినిమాపై మొదటి నుండి హైప్ తక్కువ ఉండడమే. హైప్ తక్కువ ఉండడానికి కారణం, రొటీన్ కమర్షియల్ సినిమా అనే ముద్ర ఉండడం వల్లే.

Also Read: మహేష్ బాబు విషయంలో రాంగ్ స్టెప్ వేసిన నమ్రత… సూపర్ స్టార్ రియాక్షన్ ఇదీ..?

పైగా ‘ఓజీ’ లాంటి ‘జెన్ జీ’ ఆడియన్స్ సినిమా తర్వాత , ఇలాంటి రొటీన్ కమర్షియల్ సినిమా అంటే ఇలాంటి ఫలితమే వస్తుందని విడుదలకు ముందే చాలా మంది అభిమానులు ఫిక్స్ అయిపోయారు. కమర్షియల్ సినిమాలను జనాలు ఇప్పుడు చూసే ఏకైక సీజన్ , సంక్రాంతి సీజన్ మాత్రమే. ఈ సీజన్ ని దాటి వేరే సీజన్ లో విడుదల చేస్తే మాత్రం చావు దెబ్బ తప్పదు. బహుశా స్టార్ హీరోలు ఇక మీదట కమర్షియల్ సినిమాలు చేయకపోవచ్చు. పవన్ కళ్యాణ్ కూడా ఈ జానర్ కి ఇక మీదట దూరంగా ఉండబోతున్నాడు. ఇక స్టార్ హీరోల నుండి పాన్ ఇండియన్ జెన్ జీ తరహా సినిమాలు తప్ప, కమర్షియల్ సినిమాని ఆశించలేము. ఒకప్పుడు టాలీవుడ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన కమర్షియల్ సినిమా ట్రెండ్, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం తో ముగిసినట్టే అనుకోవచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular