Ustaad Bhagat Singh advance bookings: మరో 5 రోజుల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం విడుదల కాబోతుంది. ఎప్పుడో 2020 వ సంవత్సరం లో ప్రకటించిన ఈ సినిమా , పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్స్ కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చి, ఎట్టకేలకు గత ఏడాది పూర్తి చేసుకొని ఇప్పుడు మన ముందుకు రాబోతుంది. అయితే 2020 నుండి 2025 కి తెలుగు సినిమా ఆడియన్స్ అభిరుచి పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరోలందరూ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ స్టాండర్డ్స్ ని పెంచడంతో కమర్షియల్ సినిమాలంటే జనాల్లో క్రేజ్ తగ్గిపోయింది. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా సరే, కమర్షియల్ సినిమా చేసి, దానికి సరైన బజ్ క్రియేట్ అవ్వకపోతే మాత్రం ఘోరమైన పరాభవం తప్పేలా లేదు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఇండస్ట్రీ లో ఎంత మంచి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.
అలాంటి కాంబినేషన్ లో ‘గుంటూరు కారం ‘ లాంటి మామూలు కమర్షియల్ సినిమా తెరకెక్కడంతో , ఆ చిత్రానికి ఎంత దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయో మన కళ్లారా చూశాం. సంక్రాంతి సీజన్ లో వచ్చినప్పటికీ కూడా ఆ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అవ్వలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రానికి అంతకు మించిన పరాభవం ఎదురయ్యేలా ఉంది. పవన్ కళ్యాణ్ గత చిత్రం ‘ఓజీ’ కి ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజున 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి, నార్త్ అమెరికా లో 3 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు కూడా వచ్చింది. అంతటి సెన్సేషన్ తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రానికి నార్త్ అమెరికా లో కనీస స్థాయిలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం లేదు.
Also Read: సుడిగాలి సుధీర్ రాబోయే రోజుల్లో మరో శివ కార్తికేయన్ కాబోతున్నాడా? ప్లానింగ్ చూస్తే అలాగే ఉంది!
అక్కడి ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ కి ఇప్పటి వరకు కనీసం 2 లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు. 3 మిలియన్ డాలర్లను ప్రీమియర్స్ నుండి కొల్లగొట్టిన ఇద్దరు ముగ్గురు ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకరు పవన్ కళ్యాణ్ . అలాంటి హీరో తదుపరి చిత్రానికి ఇంత తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అవ్వడం చూస్తుంటేనే తెలుస్తోంది. ఈ సినిమా పై కనీసం అభిమానులు కూడా ఆసక్తి చూపడం లేదనే విషయం . కాసేపటి క్రితమే ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. అక్కడ కూడా ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగడం లేదు. నేడు విడుదల అవ్వబోయే థియేట్రికల్ ట్రైలర్ మీదనే అభిమానుల ఆశలన్నీ. ఆ ట్రైలర్ బాగాలేకపోతే, ‘హరి హర వీరమల్లు’ కంటే ఘోరమైన పరాభవాన్ని చూడాల్సి వస్తుంది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
