Nayanthara: నయనతార సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్. రెండు దశాబ్దాలుగా ఆమె సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటుతుంది. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ లో ఒకరు. నయనతారకు వివాహమైంది. అయినప్పటికీ ఆమెకు డిమాండ్ తగ్గలేదు. ఇప్పటికి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు, స్టార్ హీరోల సరసన ఆఫర్స్ అందుకుంటుంది. ఇక నయనతార జీవితం వివాదాల మయం. కెరీర్ బిగినింగ్ లోనే ఆమె ప్రేమలో పడింది. నటుడు శింబుతో నయనతార రిలేషన్ నడిపింది.
వీరిద్దరి ప్రైవేట్ ఫోటోలు అప్పట్లో సంచలనం రేపాయి. శింబు-నయనతార వివాహం చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. అనూహ్యంగా శింబుకు నయనతార బ్రేకప్ చెప్పింది. కొంచెం గ్యాప్ ఇచ్చి దర్శకుడు, నటుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవకు దగ్గరైంది. ప్రభుదేవను వివాహం చేసుకోవాలని అనుకుంది. నయనతారను వివాహం చేసుకోవాలని ప్రభుదేవ తన భార్యకు విడాకులు ఇచ్చాడు. ప్రభుదేవ భార్య నయనతార పై తీవ్ర విమర్శలు చేసింది.
ప్రభుదేవతో కూడా నయనతార బంధం పెళ్లి వరకు వెళ్ళలేదు. ఇద్దరూ విడిపోయారు. ముచ్చటగా డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించింది. నాన్ రౌడీ దాన్ చిత్రానికి విగ్నేష్ శివన్ దర్శకుడు. ఆ మూవీ షూటింగ్ సమయంలో దగ్గరయ్యారు. ఏళ్ల తరబడి కలిసి తిరుగుతున్నారు. పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు. దాంతో విగ్నేష్ శివన్ తో కూడా పెళ్లి కష్టమే అనుకున్నారు. 2022లో సంతోష్ శివన్ ని వివాహం చేసుకుంది.
పెళ్ళై ఏడాది గడవక ముందే సరోగసీ పద్దతిలో ఇద్దరు కవల అబ్బాయిలకు జన్మనిచ్చింది. ఇది వివాదాస్పదం అయ్యింది. నయనతార దంపతులపై ప్రభుత్వం విచారణ జరిపింది. తగు పత్రాలు చూపించి బయటపడింది. తమకు చాలా ఏళ్ల క్రితమే వివాహమైంది. సరోగసీ చట్టాలకు లోబడే పిల్లల్ని కన్నామని వివరణ ఇచ్చారు. దాంతో ఆ వివాదం ముగిసింది. పెళ్లయ్యాక తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న నయనతార మాడ వీధుల్లో చెప్పులతో తిరిగింది. క్షమాపణలు చెప్పడంతో వివాదం సమసింది.
కాగా అందం కోసం నయనతార సర్జరీలకు పాల్పడ్డారనే వాదన ఉంది. ఈ ఆరోపణల మీద నయనతార స్పందించింది. నేను ఐ బ్రోస్ కి (కను బొమ్మలకు) కాస్మటిక్ సర్జరీ చేయించుకున్నాని కొందరు అంటున్నారు. నిజానికి అందం కోసం నేను ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదు. నేను తరచుగా ఐ బ్రోస్ చేయిస్తాను. అందుకే భిన్నంగా కనిపిస్తున్నాయి అన్నారు. నయనతార కామెంట్స్ తో దీనిపై పూర్తి స్పష్టత వచ్చింది