OG movie climax twist: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేస్తున్న ప్రతి సినిమాతో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఆయన చేసిన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఓజి సినిమా విషయంలో అతని అభిమానులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక ఈ సినిమా రేపు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈరోజు రాత్రి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ అయితే పడుతున్నాయి. ఇక ఇప్పటికే యూఎస్ఏ లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ అయితే వేశారు.
మరి అందులో ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు సినిమా బ్లాక్ బస్టర్ అంటూ భారీ రివ్యూ చెప్పడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…ఈ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక యూఎస్ఏ లో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఈ సినిమాలో రెండు సీన్లు ఈ సినిమాకు చాలా వరకు ప్లస్ అయినట్టుగా తెలుస్తున్నాయి.
అందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముంబై లోకి అడుగు పెట్టే సన్నివేశం, రెండు శ్రేయ రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎలివేషన్ ఇస్తున్నప్పుడు వచ్చే కొన్ని సన్నివేశాలు అతని గురించి ఫ్లాష్ బ్యాక్ చెప్పినప్పుడు రివిల్ అయ్యే మరికొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ అలాగే ఒక ట్విస్ట్ కూడా ఈ సినిమా మీద బీభత్సమైన క్రేజీ అయితే సంపాదించి పెట్టబోతుందట.
మరి యూఎస్ఏ ప్రేక్షకులు ఈ సినిమాకి ఫుల్ ఫిదా అయిపోయారు. ఇక తెలుగు ప్రేక్షకులు ఎలా రెస్పాండ్ అవుతారు ఈ సినిమాని చూసిన వాళ్ళు ఎలాంటి అనుభూతిని పొందుతారు అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక యుఎస్ఏ ప్రేక్షకులు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందు ఏ సినిమా నిలబడదు, అన్ని మూవీస్ రికార్డులు బద్దలవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది…