Nara Lokesh Funny Video: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. మంత్రులకు శాఖలపరంగా నిలదీసినంత పనిచేస్తున్నారు. మండలిలో అయితే వైసీపీ ఎమ్మెల్సీలు తన వాణిని గట్టిగానే వినిపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ చైర్మన్ గా వైసీపీ నేత ఉన్నారు. ఆపై మండలిలో వైసీపీ పక్ష నేతగా సీనియర్ బొత్స సత్యనారాయణ ఉన్నారు. అసెంబ్లీలో అయితే కూటమి పార్టీలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి తగిన సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేనేత కార్మికుల విషయంలో కీలక ప్రతిపాదన చేశారు. దీనిపై స్పందించిన నారా లోకేష్ బుచ్చయ్య తాత అనేసరికి సభలో నవ్వులు పూశాయి.
తాత కాదు అంకుల్..
డిప్యూటీ స్పీకర్ రఘురామక్రిష్ణంరాజు ఈ రోజు సభను నడిపించారు. ఈ క్రమంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేనేత కార్మికులకు సంబంధించి కీలక ప్రతిపాదన చేశారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ బుచ్చయ్య తాత అని వ్యాఖ్యానించారు. దీనిపై డిప్యూటీ స్పీకర్ రఘురామక్రిష్ణంరాజు తాత కాదు అంకుల్ అనండి అనేసరికి..లోకేష్ క్షమించండి.. నాకు చిన్నప్పటి నుంచి తాతయ్య అని పిలవడం అలవాటైందని.. అందులోనే ఎంతో గౌరవం, అప్యాయత, చనువు ఉందని చెప్పుకొచ్చారు. దీంతో సభలో ఎమ్మెల్యేలు ఒక్కసారిగా నవ్వేశారు.
సీనియర్ లీడర్..
గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ మోస్టు పొలిటికల్ లీడర్. కానీ ఆయనకు మంత్రి పదవి లోటు అలానే ఉండిపోయింది. టీడీపీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నేత కూడా. 1983 నుంచి గెలుస్తూ వస్తున్నారు. అయితే 1995 టీడీపీ సంక్షోభ సమయంలో ఆయన నందమూరి తారక రామారావు వైపు ఉండిపోయారు. ఎన్టీఆర్ మరణానంతరం కొద్దిరోజులు లక్ష్మీపార్వతి వెంట నడిచారు. ఆమెతో విభేదాలు ఏర్పడడంతో మళ్లీ చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీలో చేరి.. సుదీర్ఘ కాలం కొనసాగుతూ వచ్చారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పట్లో ఆ వ్యాఖ్య చేసినందుకే తాజాగా బుచ్చయ్యచౌదరికి మంత్రి పదవి లభించలేదని ప్రచారం జరిగింది. లోకేష్ అడ్డుకున్నారని కూడా సోషల్ మీడియాలో టాక్ నడిచింది. కానీ ఈ రోజు బుచ్చయ్య చౌదరిని తాత అని సంభోధించి ఆయన విషయంలో తన అభిప్రాయాన్ని చెప్పారు లోకేష్.
అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్, మంత్రి, ఎమ్మెల్యే మధ్య సరదా సంభాషణ
మంత్రి @naralokesh : బుచ్చయ్య చౌదరి గారు క్షమించాలి తాతయ్య అనేశాను. @KRaghuRaju : బుచ్చయ్య అంకుల్ అంటే బాగుంటుంది. pic.twitter.com/YJYVMBdlYi
— greatandhra (@greatandhranews) September 24, 2025