Urvashi Rautela
Urvashi Rautela : నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్షన్లో రూపొందిన సినిమా డాకు మహారాజ్. గత నెల సంక్రాంతి కానుకగా విడుదల అయింది. ఈ సినిమాలో బాలయ్య సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు నటించారు. బాలకృష్ణ భార్య పాత్రలో ప్రగ్యా జైస్వాల్ నటించారు. విలన్ భార్య పాత్రలో శ్రద్దా శ్రీనాథ్ నటించారు. కీలకమైన లేడీ పోలీస్ పాత్రలో ఊర్వశి రౌతేలా నటించారు. ముగ్గురిలోకి ఊర్వశి రౌతేలా పాత్ర నిడివి ఎక్కువగా ఉండి ప్రేక్షకుల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా బాలకృష్ణతో ఆమె ఆడిపాడిన దబిడి దిబిడి సాంగ్ మొదట ట్రోలింగ్ కు గురైనా తర్వాత ఓ రేంజ్ లో దున్నేసింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను సాధించింది. దీంతో ఫుల్ టైం పాత్రలకు పెద్దగా అంగీకరించని ఊర్వశీ రౌతేలాకు డాకు మహారాజ్ మంచి పేరే తెచ్చిపెట్టింది.
ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లో ఇప్పటికే అమ్మడు రెండు మూడు సినిమాలకు కమిట్ అయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందుతున్న సినిమాలో ఊర్వశి రౌతేలా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. దీంతో ఊర్వశి రౌతేలా ఎప్పటి లాగే ఐటెం సాంగులో కనిపిస్తుందని అంటున్నారు. బాబాయ్ బాలకృష్ణ సినిమాలో నటించిన వెంటనే.. ఆమె అబ్బాయి సినిమాలో నటించే అవకాశం దక్కించుకోవడం లక్కీ అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.
ఇక డాకు మహారాజ్ సినిమాలో దబిడి దిబిడి సాంగ్ పై మొదల్లో విపరీతంగా విమర్శలు వచ్చాయి. ఇదేం కొరియోగ్రఫీ అంటూ శేఖర్ మాస్టర్ ను ఆడిపోసుకున్నారు. కొందరు మాత్రం డ్యాన్స్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేశారు. ఈ పాట జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ట్రెండ్ అవుతోంది. దాంతో యూట్యూబ్‌లో ఈ మధ్య కాలంలో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న పాటగా నిలిచింది. బాలకృష్ణతో దబిడి దిబిడి అంటూ సంచలనం రేపిన ఊర్వశి ఇప్పుడు అబ్బాయి ఎన్టీఆర్‌తో ఎలాంటి పాటతో వస్తుందో చూడాలి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఊర్వశి రౌతేలా నటిస్తుందా లేదా అన్న వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఎన్టీఆర్ తాజా చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు టోవినో థామస్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ మొదలైన ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. వచ్చే నెల నుంచి ఎన్టీఆర్ రెగ్యులర్ షూటింగులో పాల్గొనబోతున్నారు. 2026 జనవరి 9న ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్‌ల డ్రాగన్ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు మేకర్స్. ఒకవేళ ఆ డేట్ మిస్ అయితే అదే సమ్మర్లో విడుదల అయ్యే అవకాశం ఉంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Who struck a lucky chance with a boy after babai
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com