Homeఎంటర్టైన్మెంట్సరదాల రోజు స్పెషల్ గా “బిగ్ బాస్ ఉత్సవం” !

సరదాల రోజు స్పెషల్ గా “బిగ్ బాస్ ఉత్సవం” !

BB

సండే అంటేనే సరదాల రోజు. అలిసిపోయిన బతుకులకు విశ్రాంతిని ఇచ్చే రోజు. మరి ఇలాంటి రోజు కాబట్టే.. సండేను ఎంటర్ టైనింగ్ డే అంటోంది స్టార్ మా ఛానల్. అనడమే కాకుండా.. నిజమైన ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తూ.. ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తూ వస్తోన్న స్టార్ మా వారు, ఈ ఆదివారం కూడా ఫుల్ ఫన్ తో వచ్చారు. అయితే అందులో ముఖ్యంగా ఈ సాయంత్రం 6 గంటలకు “బిగ్ బాస్ ఉత్సవం” పేరుతో ఒక అద్భుతమైన ఈవెంట్ ని ప్రసారం చేయబోతుంది.

Also Read: క‌లెక్ష‌న్ల‌ ‘ఉప్పెన‌’.. నెంబ‌ర్ 1 హీరోగా వైష్ణ‌వ్..!

చూడటానికి రెండు కళ్ళూ చాలనంత మందిని తీసుకొచ్చి ఒకే వేదికపై నిలబెట్టి, వినోదానికి అసలైన అర్ధం చెప్పబోతోంది స్టార్ మా. ఏది ఏమైనా మొత్తానికి విలక్షణమైన వినోదాన్ని అందించడంలో మొదటి నుండి కొత్త రకం కంటెంట్ తో ముందుంది స్టార్ మా. ఇక స్టార్ మాలో ఇప్పటి వరకు నాలుగు సీజన్లు ప్రసారమై ప్రతి సీజన్ అంతకు ముందు సీజన్ కంటే ఎక్కువ స్థాయి వినోదం అందించిన బిగ్ బాస్ లో సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 లో ప్రేక్షకుల్ని అలరించిన హౌస్ మేట్స్ అందరూ ఈ ఈవెంట్ లో ప్రధాన ఆకర్షణగా కనిపించబోతున్నారు. అందుకే ఈ ఈవెంట్ కోసం భారీ తారాగణం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Also Read: ఉప్పెన హీరోయిన్ వ‌య‌సు తెలుసా..? మ‌రీ ఇంత చిన్న పిల్లా..!

అయినా, ఇంతమంది సెలెబ్రిటీలను ఒక చోటకు తేవడం బహుశా అది ఒక్క స్టార్ మాకే సాధ్యం అనుకుంటా. “బిగ్ బాస్ ఉత్సవం” పేరుతో రానున్న ఈ ప్రోగ్రామ్ లో ఇన్నాళ్లకు మళ్ళీ కలిసిన ఆనందాన్ని పంచబోతుంది. ఆటలు పాటలు అన్నీ కలిసి ఈ సాయంత్రం 6 గంటలకు మరపు రాని సాయంత్రంగా మార్చబోతుంది. ఇక ఈ ఈవెంట్ తో పాటు ప్రతి ఆదివారం లాగే ఈ ఆదివారం కూడా స్టార్ట్ మ్యూజిక్ అలాగే కామెడీ స్టార్స్ షో లు ఎప్పటిలాగే అలరించడానికి సిద్ధం అవుతున్నాయి. కాకపోతే అందరూ “బిగ్ బాస్ ఉత్సవం” కోసం ఆసక్తిగా ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

“బిగ్ బాస్ ఉత్సవం” ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి:
Reunion of #BiggBossTelugu seasons for a BIGG celebration #BBUtsavamPart2 Feb 14th at 6 PM

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

1 COMMENT

Comments are closed.

Exit mobile version