Upendra : సరికొత్త ఆలోచనలతో ప్రేక్షకులకు వింత అనుభవం కలిగించే హీరోలలో ఒకరు ఉపేంద్ర. ఈయన సినిమాలు చాలా బోల్డ్ గా ఉంటాయి. హీరో గా ఈయన చేసిన సినిమాలు అత్యధికంగా రీమేక్ వి ఉంటాయి. అది పక్కన పెడితే ఈయన దర్శకత్వం లో వచ్చే సినిమాలకు మాత్రం యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంటుంది. ఆరోజుల్లో ఈయన ‘రా’, ‘ఉపేంద్ర’, ‘ఓం’ , ‘సూపర్’ వంటి సినిమాల్లో హీరోగా నటిస్తూ దర్శకత్వం కూడా వహించాడు. ఈ చిత్రాలు అప్పట్లో ఒక సెన్సేషన్. అసలు ఇలాంటి ఆలోచనలతో సినిమాలు తియ్యాలని ఎలా అనిపించింది అని ఇప్పటి తరం ఆడియన్స్ యూట్యూబ్ లో ఆయన సినిమాలు చూస్తూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మన మనసులో ఉన్న బోల్డ్ ఆలోచనలను, ఉపేంద్ర తన సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేసినట్టు, ఆయన సినిమాల్లోని కొన్ని సన్నివేశాలను చూస్తే అనిపిస్తూ ఉంటుంది.
అయితే చాలా కాలం తర్వాత ఉపేంద్ర అభిమానుల కోరిక మేరకు దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ‘UI’. రేపు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ మరియు కన్నడ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉపేంద్ర మార్క్ సినిమాని చాలా రోజుల తర్వాత చూడబోతున్నాం అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ కూడా వినిపించాయి. ఇదంతా పక్కన పెడితే ఉపేంద్ర తన సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూస్ ఇవ్వడం మనమంతా చూస్తూనే ఉన్నాం. అంతే కాకుండా ఈ సినిమా తెలుగు రైట్స్ ని కొనుగోలు చేసిన వారితో పాటుగా, పలువురు టాలీవుడ్ ప్రముఖులకు ఈ సినిమాని ప్రసాద్ ల్యాబ్స్ లో స్పెషల్ షో వేసి చూపించాడట. వాళ్ళ నుండి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
సినిమా కాన్సెప్ట్ ఏమిటంటే 2047 వ సంవత్సరానికి మన భారత దేశంలోని జనాలు కట్టుకోడానికి బట్టలు లేక, ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక, కేవలం డబ్బు, బంగారం వంటివి మాత్రమే అందుబాటులో ఉన్న సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటి వరకు ఇలాంటి ఆలోచనతో ఒక్క ఫిలిం మేకర్ కూడా మన ముందుకు రాలేదు కదూ!, అందుకే అందరిలో ఉపేంద్ర అంత స్పెషల్. యూత్ ఆడియన్స్ ఆయన్ని ఇప్పటికీ అభిమానిస్తున్నారంటే అందుకు కారణం ఇలాంటి ఆలోచన ధోరణి ఉండడం వల్లే. అయితే ఈ సినిమా మొత్తం ఒక ఎత్తు, క్లైమాక్స్ మాత్రం మరో ఎత్తు, ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అలాంటి క్లైమాక్స్ ని మనం చూసుండము. మన మేధస్సు కి పెద్ద ప్రశ్న లాంటిది ఆ క్లైమాక్స్. ఇంతకీ ఏంటి ఆ క్లైమాక్స్ అనేది తెలుసుకోవాలంటే వెంటనే సినిమాకి టికెట్స్ బుక్ చేసుకోండి.