Tollywood: గత ఏడాది సినిమా ప్రియులకు క్రిస్మస్ సీజన్ కి కరోనా కారణంగా సందడి లేదనే చెప్పాలి. అయితే ఈ ఏడాది వరుస సినిమాలతో క్రిస్మస్ కి మరింత సందడి చేయడానికి దూసుకు వస్తున్నారు టాలీవుడ్ హీరోలు. ఈ తరుణంలో డిసెంబర్ లో విడుదల కానున్న చిత్రాల గురించి ప్రత్యేకంగా మీకోసం.
ఈ డిసెంబర్ లో భారీ హంగులతో కొత్త సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం “అఖండ” ముందుగా రానుంది. ఇటీవలే ఈ సినిమా విడుదల డేట్ ని ఫిక్స్ చేసింది చిత్ర బృందం. డిసెంబర్ 2 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. సింహా, లెజెండ్ వంటి చిత్రాల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమాపై సినిమా వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆ తర్వాత డిసెంబర్ 24న నాచురల్ స్టార్ నాని, టాక్సీవాలా’తో విజయం అందుకున్న రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “శ్యామ్‌సింగరాయ్” నాని సరసన సాయి పల్లవి కృతి శెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ భారీ అంచనాలను పెంచింది. అలానే డిసెంబర్ 24న మెగా యువ హీరో వరుణ్ తేజ్ హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గని’వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయీమంజ్రేకర్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో లో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ చరణ్ వాయిస్ తో ఇంకాస్త అంచనాలను పెంచింది. మరి ఈ క్రిస్మస్ కి ఏ హీరోని సక్సెస్ వరిస్తుంది అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.