Nani: నానికి కథల పై మంచి పట్టు ఉంది. అతను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేశాడు కాబట్టి.. సరైన కథలను ఎంచుకోవడంలో మంచి టాలెంటెడ్ అని ఓ టాక్ ఉంది. కానీ నాని కథల ఎంపికలో గత మూడేళ్లుగా పట్టు తప్పింది. నాని నుంచి ఓ మంచి సినిమా వచ్చి చాలా కాలం అయింది. వి, టక్ జగదీష్ అంటూ రొటీన్ రొట్టకొట్టుడు కథలు ఒప్పుకుని సినిమాలు చేసుకుంటూ వచ్చాడు.

పైగా ఈ సినిమాలు కూడా ఓటీటీకి పరిమితం అయ్యాయి. దాంతో డిస్టిబ్యూటర్లు కూడా నాని విషయంలో బాగా నిరాశ చెందారు. నాని పై కోపం వ్యక్తపరిచినా, లేక నిరాశ వ్యక్తపరిచినా పెద్దగా నష్టం ఉండదు కాబట్టి.. డిస్ట్రిబ్యూటర్లు కూడా నాని పై సీరియస్ అవ్వడానికి తెగ ఉత్సాహపడ్డారు. మొత్తమ్మీద నాని టైం ప్రస్తుతం అసలు బాగాలేదు.
నాని అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సారి తన సినిమాను థియేటర్లోనే రిలీజ్ చేయాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు. శ్యామ్ సింగరాయ్ ను థియేటర్లలోనే రిలీజ్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాడు కూడా. ఈ సారి నాని హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. పైగా నానికి ఈ సినిమా చాలా బాగా నచ్చింది. తన కెరీర్ లోనే డిఫరెంట్ సినిమా అవుతుందని.. ముఖ్యంగా సూపర్ హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాడు.
మరి నాని ఈ సినిమా పై పెట్టుకున్న హోప్స్ ఎంతవరకు నెరవేరతాయి ? అనేదే పెద్ద డౌట్. కాకపోతే శ్యామ్ సింగరాయ్ టైటిల్, కాస్టింగ్ దగ్గర నుంచి మొన్న వచ్చిన టీజర్ వరకూ ఆకట్టుకోవడంతో సినిమా అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే, ఈ సినిమా అవుట్ ఫుట్ గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ టాక్ వినిపిస్తోంది.
Also Read: ప్చ్.. అగ్ర దర్శకుడిపై కుల ముద్ర వేయడం దారుణం !
సినిమాలో మ్యాటర్ లేదు అని, అనవసరమైన ల్యాగ్ సీన్స్ తో బోరింగ్ ల్యాగ్ డైలాగ్ లతో సినిమా ఎక్కువుగా సాగుతుందని తెలుస్తోంది. ఇదే నిజం అయితే, ఈ సినిమాకి కనీస కలెక్షన్స్ కూడా రావు. ఎందుకంటే.. అంచనాలు లేని సినిమా చూసి.. కొంచెం బాగున్నా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే, భారీ అంచనాలు ఉన్న సినిమా అద్భుతంగా అనిపించాలి. లేకపోతే పాజిటివ్ కాస్త పెద్ద నెగిటివ్ అయిపోతుంది. మరి ఇప్పుడు నాని పరిస్థితి ఏమిటో చూడాలి.
Also Read: Drushyam 2: ఇబ్బందుల్లో పడ్డ వెంకటేశ్ “దృశ్యం 2” సినిమా… కారణం ఏంటంటే ?