Actor Karthikeya: సోషల్ మీడియా లో వైరల్ గా మారిన హీరో కార్తికేయ ఫోటోలు… పెళ్లి కొడుకుగా రెడీ

Actor Karthikeya: ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు కార్తికేయ. ఈ చిత్రం తర్వాత విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించేందుకు కార్తికేయ ప్రయత్నించిన… అవి అంత సక్సెస్ కాలేదనే చెప్పాలి. హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. అయితే తాజాగా హీరో కార్తికేయ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. మరికొద్ది గంటల్లో ప్రేమించిన అమ్మాయి మెడ‌లో మూడు ముళ్లు వేసి ఆమెను […]

Written By: Raghava Rao Gara, Updated On : November 20, 2021 3:29 pm
Follow us on

Actor Karthikeya: ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు కార్తికేయ. ఈ చిత్రం తర్వాత విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించేందుకు కార్తికేయ ప్రయత్నించిన… అవి అంత సక్సెస్ కాలేదనే చెప్పాలి. హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. అయితే తాజాగా హీరో కార్తికేయ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. మరికొద్ది గంటల్లో ప్రేమించిన అమ్మాయి మెడ‌లో మూడు ముళ్లు వేసి ఆమెను త‌న అర్ధాంగిగా మార్చుకోనున్నాడు కార్తికేయ.

కాగా ఆగస్టులో కార్తికేయ, లోహిత రెడ్డి ల నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఈ తరుణంలో కార్తికేయ రేపు (నవంబర్‌21) న ఉద‌యం 9 గంట‌ల 47 నిమిషాల‌కు లోహితను పెళ్లాడనున్నాడు. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు జోరుగా జరుగుతుండగా… కార్తికేయ పెళ్లికొడుకుగా ముస్తాబయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కార్తికేయ పెళ్లి వేడుకకు ఆయ‌న బంధు మిత్రుల‌తో పాటు పలువురు టాలీవుడ్ సెల‌బ్రిటీలు కూడా హాజ‌రు కానున్న‌ట్లు తెలుస్తోంది.

కార్తికేయ ఇటీవలె రాజా విక్రమార్క సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని  టి.ఆదిరెడ్డి సమర్పణలో శ్రీచిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై 88 రామారెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి శ్రీ సరిపల్లి దర్శకత్వం వహించగా…  తాన్యా రవిచంద్రన్  హీరోయిన్ గా నటించింది. అలానే  ఈ సినిమాలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్, తనికెళ్ళ భరణి, హర్షవర్ధన్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రశాంత్ ఆర్ విహారి ఈ సినిమాకు సంగీతం అందించారు. నవంబర్ 12 న విడుదలైన ఈ చిత్రంలో కార్తికేత ఎన్ ఐ ఏ ఏజెంట్ గా నటించి మెప్పించారు.