
తెలుగు సినీ రంగంలో ఇపుడు ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది . రాబోయే మూడు చిత్రాల్లో బాక్సింగ్ నేపధ్యం ఉండబోతోంది. రామ చరణ్ , వరుణ్ తేజ్ , విజయ్ దేవరకొండ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి .
ఘోరం.. రైలు చక్రాలక్రింద నలిగిన కూలి బ్రతుకులు!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఎన్. టి. ఆర్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్లో ” రౌద్రం రణం రుధిరం “( R R R ) అనే భారీ చిత్రం లో నటించడం జరుగుతోంది .అలియా భట్ హీరో్యిన్ గా నటిస్తోన్న ఈ చిత్రం యొక్క షూటింగ్ కార్యక్రమాలు కరోనా ప్రభావంతో ఆగిపోయాయి. ఇక రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రం యొక్క ప్రోమోలో రామ్ చరణ్ బాక్సింగ్ చేస్తూ కనపడటం జరిగింది. ఆ క్రమంలో ఒక ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ఈ బాక్సింగ్ సన్నివేశాల్లో సహజత్వం కోసం రామ్ చరణ్ ప్రొఫెషనల్ బాక్సర్ నీరజ్ గోయత్ దగ్గర ప్రత్యేకమైన శిక్షణను తీసుకొన్నాడట ..ఈ విషయాన్ని సదరు ట్రైనర్ నీరజ్ గోయత్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూలైలో సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి.
గ్యాస్ లీకేజ్ నివారణకు ప్రత్యేక బృందం..!
ఇక రెండో చిత్రం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ” బాక్సర్ ” చిత్రం పూర్తిగా బాక్సింగ్ నేపథ్యంలోనే రూపొందు తోంది.కాగా ఈ చిత్రంలో వచ్చే బాక్సింగ్ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ లార్నెల్ స్టోవల్ దగ్గర వరుణ్ తేజ్ శిక్షణ తీసుకున్నాడని తెలుస్తోంది. వరుణ్ తేజ్ కజిన్ సిద్దు ముద్దా , అల్లు వెంకటేష్ (బన్నీ అన్నయ్య )సంయుక్తంగా నిర్మిస్తున్నఈ “బాక్సర్ ” చిత్రం లాక్ డౌన్ ముగియగానే మిగతా భాగం షూటింగ్ జరుపు కొంటుందని తెలుస్తోంది
ఇక బాక్సింగ్ నేపథ్యంలో రూపొందే మూడో చిత్రం విజయ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాధ్ నిర్మించడం జరుగుతోంది. ” ఫైటర్ ” అనే టైటిల్ తో రూపొందే ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్లో ఛార్మి , పూరి జగన్నాధ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు .