Homeఎంటర్టైన్మెంట్హ్యాట్రిక్ హిట్ ఖాయమంటున్న సాయి తేజ్

హ్యాట్రిక్ హిట్ ఖాయమంటున్న సాయి తేజ్


ఆ మధ్య వరుస అపజయాలు ఎదుర్కొన్న సాయి తేజ్ ఇపుడు వరుస విజయాలు వచ్చేలా కెరీర్ ప్లాన్ చేసుకొంటున్నాడు. గత ఏడాది “చిత్ర లహరి , ప్రతిరోజూ పండగే ” చిత్రాలతో బౌన్స్ బ్యాక్ అయిన సాయి తేజ్ ఇపుడు రాబోయే మూడో చిత్రం తో హ్యాట్రిక్ విజయం ఖాయ మంటున్నాడు . .ప్రస్తుతం సాయి (ధరమ్) తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. నూతన దర్శకుడు .సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్నిప్రముఖ నిర్మాత బీవీఎస్.యన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.కాగా ఈ సినిమాలో ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అండర్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలని భావించారు. కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల వాయిదా పడింది.

ఘోరం.. రైలు చక్రాలక్రింద నలిగిన కూలి బ్రతుకులు!

‘ఒక బ్యాచిలర్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ” సోలో బ్రతుకే సో బెటర్ ” చిత్రం చాలా ఫన్నీగా , పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. ఇక ఈ సినిమాలో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది .కాగా ఈ సినిమా కాంటెంపరరీ ఇష్యూస్ మీద నడుస్తుందని.. ఆ క్రమంలో హ్యూమర్ జెనెరేట్ చేస్తూ ఉంటుందని తెలుస్తోంది . గతేడాది ‘ప్రతిరోజూ పండగే’తో కామెడీ పండించిన సాయి తేజ్ మరోసారి అదే ఫార్ములాని అప్లై చేస్తున్నట్టు తెలుస్తోంది.సంగీత సంచలనం థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం తో తనకు హ్యాట్రిక్ హిట్ ఖాయమని సాయి తేజ్ గట్టి నమ్మకంతో ఉన్నాడు .

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular