Tollywood Sequel Movies: రెండు పార్టులుగా వచ్చిన, రాబోతున్న సినిమాలు

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కతోన్న చిత్రం ‘దేవర’. కథా రీత్యా స్పాన్ ఎక్కువగా ఉండటంతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. మొత్తంగా ఎన్టీఆర్ కెరీర్‌లో రెండు భాగాలుగా రాబోతున్న తొలి చిత్రంగా ‘దేవర’ మూవీ నిలువనుంది.

Written By: Velishala Suresh, Updated On : October 5, 2023 12:55 pm

Tollywood Sequel Movies

Follow us on

Tollywood Sequel Movies: ఇప్పుడు సినిమాల్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు సినిమా కేవలం ఒక పార్టుగా మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు రెండు పార్టులుగా వస్తున్నాయి. అందులోనూ పాన్ ఇండియా రేంజ్ లో ఈ పార్టులు రావడం గ్రేట్. ఎందుకంటే రెండు పార్టులను కూడా దేశ వ్యాప్తంగా ప్రజలు ఆదరిస్తున్నారు. ఇలాంటి సినిమాల్లో కొన్ని కథా రీత్యా ఎక్కువ స్పాన్ ఉంటే.. రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. బాహుబలి, కేజీఎఫ్, పొన్నియన్ సెల్వర్ సినిమాలు రెండు పార్టులుగా తెరకెక్కాయి. అటు పుష్ప, సలార్ రెండు భాగాలుగా రానుంది. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర సినిమా కూడా రెండు పార్టులుగా రాబోతుంది.

బాహుబలి..దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో ప్రభాస్ హీరోగా విలన్ పాత్రలో రానా మెప్పించారు. మంచి ట్విస్ట్ తో ఎండ్ చేసిన ఈ సినిమా మరో పార్ట్ గా కూడా వచ్చింది. అయితే కథ నిడివి ఎక్కువగా ఉండటంతో రెండు భాగాలుగా తెరకెక్కించారు దర్శకనిర్మాతలు. మొదటి భాగాన్ని మించి రెండో భాగం సంచలన విజయం సాధించింది. అంతేకాదు ఒక ప్రాంతీయ భాష చిత్రం భారతీయ చిత్ర పరిశ్రమలో అతి పెద్దైన హిందీ సినిమాలను సైతం బాహుబలి ముందు తేలిపోయాయనే చెప్పాలి. ఈ సినిమాతోనే ఒక్కసారిగా టాలీవుడ్ రేంజ్ ఏంటో బయట పడింది. దేశం మొత్తం టాలీవుడ్ వైపు చూస్తున్నారు అంటే అది బాహబలి, జక్కన్నల వల్లే అంటారు విశ్లేషకులు.

కేజీఎఫ్.. కేజీఎఫ్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో యశ్ రేంజ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పటికే కేజీఎఫ్ మూవీని రెండు పార్టులుగా తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. దీంతో ఫష్ట్ పార్ట్ హిట్ నేపథ్యంలో రెండో పార్ట్ రూ. 1200 కోట్లకు పైగా వసూళు చేసి సంచలనం రేపింది. ఇదే రూట్లో ప్రభాస్‌తో చేస్తోన్న ‘సలార్’ మూవీని కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. దీంతో ఈ సినిమా రెండు భాగాలు కలిపి రూ. 3000 వేల కోట్లు వసూళు చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారట. అయినా ఈ మధ్య ప్రభాస్ సినిమాలు ఢీలా పడడంతో కాస్త భయంగానే ఉందట అభిమానుల్లో.. మరి ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

పుష్ప.. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముందు పార్ట్ సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు రెండోపార్ట్ కూడా రావడానికి సిద్దమవుతుంది. మొదటి భాగం 2021 డిసెంబర్ 17న విడుదలైంది. తెలుగులో బ్రేక్ఈవెన్ కానీ ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయం సాధించింది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 365 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. అల్లు అర్జున్.. పుష్ప సక్సెస్‌తో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఇక బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా రెండో భాగం గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగష్టు 15న వచ్చే యేడాది స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

దేవర.. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కతోన్న చిత్రం ‘దేవర’. కథా రీత్యా స్పాన్ ఎక్కువగా ఉండటంతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. మొత్తంగా ఎన్టీఆర్ కెరీర్‌లో రెండు భాగాలుగా రాబోతున్న తొలి చిత్రంగా ‘దేవర’ మూవీ నిలువనుంది.

ఎన్టీఆర్ బయోపిక్..నందమూరి నట సింహం బాలకృష్ణ .. తన తండ్రి జీవితాన్ని రెండు భాగాలుగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’గా తెరకెక్కించారు. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడులో రామారావు ఎలా హీరోగా మారడానికి ఎలాంటి అనుభవాలు ఫేస్ చేసారు. తన సినీ జీవితంలో చేసిన భారీ సాహాసాలను చూపించారు. రెండో పార్ట్ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’లో మాత్రం అన్నగారి రాజకీయ ప్రస్థానాన్ని గురించి చూపించారు. ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందలేక పోయాయి.

ఫొన్నియన్ సెల్వన్.. ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ పొన్నియిన్ సెల్వన్ 1. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ సినిమా తెలుగు సహా వివిధ భాషల్లో అంతగా వర్కౌట్ కాలేదు. రెండో పార్ట్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. తమిళంలో మాత్రం సూపర్ హిట్‌గా నిలిచింది.

మొత్తం మీద కథ ఎక్కువైతే.. రెండు పార్టులుగా తెరకెక్కించడం అనే కాన్సెప్ట్‌కు బాహుబలి తర్వాత ఎక్కువైపోయింది. ఇలాంటి సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ కూడా ఎక్కువగా ఉండడంతో సినిమాలు మంచి హిట్ లను సొంతం చేసుకుంటున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో రెండు పార్టులుగా వస్తున్నా ప్రేక్షకుల ఆదరణం అంతకు మించే ఉంటుంది కానీ ఏ మాత్రం తగ్గడంలేదు.