Trisha: ఈ వర్షం సాక్షిగా అంటూ.. కుర్రకారు గుండెలను కొల్లగిట్టింది. నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా అంటూ.. యువకుల హృదయాల్లో స్థానం సంపాదించింది. ఆమె నటించిన హిట్ సినిమా హిట్టా, ఫట్టా అనే విషయాలు పట్టించుకోకుండానే చూసేంత పిచ్చి అభిమానులను సంపాదించుకుంది. ఇక నిర్మాతలు, దర్శకులు కూడా ఆమె డేట్స్ కోసం క్యూ కట్టారు. 2000 దశకంలో ఓ వెలుగు వెలిగిన ఆ స్టార్ హీరోయిన్ తాజాగా సెకండ్‌ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. పొన్నియన్ సెల్వన్ సినిమాతో మళ్లీ హిట్ అందుకుంది. ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఎస్.. ఆమె త్రిష.
సెకండ్ ఇన్నింగ్స్‌లో దూకుడు..
చాలా ఫెల్యూర్స్ తర్వాత తాజాగా త్రిష సెకండ్ ఇన్నింగ్ సక్సెస్‌తో షురూ చేసింది. ఇటీవల వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు దశాబ్దాలుగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న త్రిష ఇప్పటివరకు కోట్లాదిమంది ఫాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది మణిరత్నం భారీ మల్టీస్టారర్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’తో సూపర్ సక్సెస్ అందుకుని అదే ఫామ్‌తో ముందుకు పోతుంది. అయితే ఇటీవల త్రిష ఓ బాబుని ఎత్తుకుని కనిపించడంతో అతను ఆమె కొడుకే అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఎవరా బాబు..?
తాజాగా, త్రిష మరోసారి షూటింగ్‌లో అదే బాబుని ఎత్తుకుని ఆడిస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో వెతకడం మొదలెట్టారు. చివరికి ఆ బాబు ఎవరో తెలిసిపోయింది. ఆ బుజ్జి బాబు ఎవరో కాదు మలయాళ నటి మియాజార్జ్ కుమారుడు. త్రిష కీలక పాత్రలో నటించిన మూవీ ‘ది రోడ్’. ఇందులో మలయాళ భామ మియా జార్జ్ కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ షూటింగ్ టైంలో త్రిష ఇలా మియా జార్జ్ కొడుకుతో ఆడుకుంటూ కనిపించింది. ఇదిలా ఉంటే ‘ది రోడ్’ అక్టోబర్ 6న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక త్రిష వీడియో నెట్టింట వైరల్ కావడంతో మీయా జార్జ్ కొడుకు బలే క్యూట్‌గా ముద్దొస్తున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
@trishtrashers with #MiyaGeorge ‘s son during #TheRoad shoot.#RevengeFromOct6 #TheRoadFromOct6 #Trisha #SouthQueenTrisha pic.twitter.com/t8vqbbev6W
— Trisha Krishnan FC (@ActressTrisha) October 4, 2023