spot_img
Homeఎంటర్టైన్మెంట్Upasana: మెగా వారసుడు ఆరోగ్యం కోసం ఉపాసన సంచలన నిర్ణయం... ఆమె చేస్తున్న పని తెలిస్తే...

Upasana: మెగా వారసుడు ఆరోగ్యం కోసం ఉపాసన సంచలన నిర్ణయం… ఆమె చేస్తున్న పని తెలిస్తే షాక్ అవుతారు!

Upasana: మనిషి జీవనం అత్యంత ఆధునికం అవుతుంది. అన్ని రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం ఎల్లలు దాటిపోతుంది. హెల్త్ సైన్సెస్ ఇప్పటికే అనేక అద్భుత శిఖరాలకు చేరాయి. అయినా మానవులను పలు కొత్త రోగాలు వేధిస్తున్నాయి. భవిష్యత్తులో వచ్చే అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు తొలగించేందుకు కొన్ని కొత్త మార్గాలు అన్వేషించారు. వాటిలో స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ ఒకటి. హ్యూమన్ బాడీ నుండి సెల్స్ తీసి వాటిని భద్రపరచి అత్యవసర పరిస్థితులలో చికిత్సగా వాడుకోవడం ఒక పద్దతి. మరొక ఆధునిక విధానం కూడా అందుబాటులోకి వచ్చింది.

బిడ్డ పుట్టినప్పుడు మాయ, బొడ్డులో మిగిలి ఉన్న రక్తాన్ని సేకరించి భద్రపరుస్తారు. దీన్ని కార్డు బ్లడ్ ప్రిజర్వేషన్ అంటారు. ఈ పద్దతిని తన బిడ్డ కోసం ఉపాసన అనుసరించనున్నారట. స్టెమ్ సైట్ ఇండియా అనే సంస్థ ఈ సర్వీస్ అందిస్తుంది. తన బిడ్డ కార్డు బ్లడ్ ని ప్రిజర్వ్ చేయనున్నట్లు ఉపాసన చెప్పుకొచ్చారు. అంటే భవిష్యత్తులో మెగా వారసుడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తెలెత్తినా, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉపాసన ఈ పనికి పూనుకున్నారు.

కాగా 2022 డిసెంబర్ లో చిరంజీవి ఉపాసన ప్రెగ్నెన్సీ ప్రకటన చేశారు. తన కోడలు ఉపాసన ఆ ఆంజనేయ స్వామి అశీసులతో తల్లి అయినట్లు ప్రకటించారు. ఉపాసన తల్లైతే చూడాలనేది మెగా అభిమానుల పదేళ్ల కల. అది ఎట్టకేలకు నెరవేరింది. త్వరలో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఉపాసన అమెరికాలో ప్రసవిస్తారని ఓ పుకారు లేచింది. ఆ వార్తలకు ఉపాసన చెక్ పెట్టారు. తాను ఇండియాలోని అపోలో హాస్పిటల్స్ లో ప్రసవిస్తానని ఆమె చెప్పారు.

ఇటీవల ఉపాసనకు ఘనంగా సీమంతం వేడుక ఘనంగా నిర్వహించారు. ఇరు కుటుంబాల సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. 2012లో ఉపాసన-రామ్ చరణ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. పదేళ్ల వరకు పిల్లల్ని కనకూడదని నిర్ణయం తీసుకున్నారట. ఈ క్రమంలో బంధువులు, కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి ఎదురైనా మా నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ఉపాసన తెలిపారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper
Exit mobile version