
Ram Charan- Upasanas : గోల్డెన్ గ్లోబ్ , ఆస్కార్ ప్రమోషన్ల కోసం రాజమౌళి తన సొంత జేబులోంచి చాలా ఖర్చు చేసాడని టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం అమెరికాలో లా కాలం ఉండి మరీ ఈ ఖర్చును వెచ్చించాడు.
అమెరికాలో బస, ప్రమోషన్ల విషయాల్లో తన కుటుంబాన్ని సైతం అమెరికా తీసుకెళ్లి అక్కడే అన్నీ చూసుకుంటున్నాడు.
మరోవైపు ఈ ప్రమోషన్ల కోసం హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ లు సైతం అమెరికా వెళ్లారు. ఇక రామ్ చరణ్‌తో కలిసి ఆయన భార్య ఉపాసన కూడా అమెరికా వెళ్లింది. ఈ సందర్భంగా రాంచరణ్ తో కలిసి ఉండేందుకు ఉపాసన కొంతకాలం పాటు లాస్ ఏంజిల్స్ లో ఏకంగా లగ్జరీ బంగ్లాను అద్దెకు తీసుకుంది.
ఇక ఉపాసన గర్భవతి కావడంతో ఇద్దరు ముగ్గురు సహాయకులను కూడా నియమించుకుంది. ఈ బంగ్లాలో వారి సేవలను వినియోగించుకోవడానికి ఏకంగా అమెరికాకు వారిని ఇండియా నుంచి తీసుకెళ్లినట్టు సమాచారం.
ఆస్కార్ గెలిచాక వేడుకలు లాస్ ఏంజిల్స్ లో ఈ లగ్జరీ బంగ్లాలోనే ఉపాసన-రాంచరణ్ జరుపుకుంటున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
మొత్తానికి నాటు నాటూ ఆస్కార్‌ను గెలుచుకోవడం తెలుగు చలనచిత్ర వర్గానికి చారిత్రక విజయంగా మారింది, సంగీత , సాహిత్య రచయితలకు ఇది గౌరవంగా మారింది. ఈ వేడుకలు ఆనందంగా జరుపుకోవడానికి ఏకంగా రాంచరణ్ కు, తనకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉపాసన చేపట్టిన చర్యలు మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
