AP CM Jagan Delhi Tour : వైసీపీతో బీజేపీ పొత్తు..? జగన్ సడెన్ ఢిల్లీ టూర్ హాట్ టాపిక్

AP CM Jagan Delhi Tour : కేంద్రంలోని బీజేపీ దృష్టంతా ప్రధానంగా దక్షిణ రాష్ట్రాలపైనే ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణాలో పాతుకు పోయేందుకు ప్రయత్నాలు చేస్తున్న మోదీ, అమిత్ షాల ద్వయం ఇప్పుడు ఆంధ్రపైనా పడినట్లుంది. ప్రస్తుతం ఏపీలో ఆ పార్టీ గెలుపు అసాధ్యమే. తమకు అనుకూలమైన పార్టీతో వెళితే భవిష్యత్తు బాగుంటుంది. అందు కోసం బీజేపీ ప్లాన్ బీ అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. జగన్ సడన్ ఢిల్లీ టూర్ అందుకేనా? ముఖ్యమంత్రి జగన్ […]

Written By: SHAIK SADIQ, Updated On : March 16, 2023 7:41 pm
Follow us on

AP CM Jagan Delhi Tour : కేంద్రంలోని బీజేపీ దృష్టంతా ప్రధానంగా దక్షిణ రాష్ట్రాలపైనే ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణాలో పాతుకు పోయేందుకు ప్రయత్నాలు చేస్తున్న మోదీ, అమిత్ షాల ద్వయం ఇప్పుడు ఆంధ్రపైనా పడినట్లుంది. ప్రస్తుతం ఏపీలో ఆ పార్టీ గెలుపు అసాధ్యమే. తమకు అనుకూలమైన పార్టీతో వెళితే భవిష్యత్తు బాగుంటుంది. అందు కోసం బీజేపీ ప్లాన్ బీ అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది.

జగన్ సడన్ ఢిల్లీ టూర్ అందుకేనా?

ముఖ్యమంత్రి జగన్ హఠాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా, ఇక్కడి అన్ని వ్యవహారాలు వదిలేసి ఢిల్లీకి వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మార్చిలో రాష్ట్రానికి మరిన్ని అప్పులు కావాలని, వచ్చేది ఎన్నికల సంవత్సరం అవుతున్నందున మరింత దయ తలచాలని హస్తినకు వెళ్లినట్లుగా ప్రతిపక్షాలు చెబుతున్నాయి. అలాగే, ఢిల్లీ లిక్కర్ స్కాంలో వైపీపీ నేతలను కాపాడుకునేందుకు, బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ నేపథ్యంలో జగన్ హస్తినకు వెళ్లినట్లు ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తుంది.

అంత అర్జెంటుగా పిలుపు వెనుక?

టీడీపీ ఆరోపణలు అటుంచింతే, బీజేపీ నేతలు ఎవరినీ హఠాత్తుగా ఎందుకు పిలిచినట్లోనన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీతో జనసేన కలిసి ఉంది. పవన్ కల్యాణ్ రాష్ట్రంలో ప్రభావిత స్థాయిలో ఉన్నా, స్వంతంగా గెలవలేరని మోదీ భావిస్తున్నట్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు దూరంగా జరిగిందుకు సిద్ధపడినట్లు తెలుస్తుంది.

జగన్ తో పొత్తు ఖాయమేనా?

ముఖ్యమంత్రి జగన్‌తో మోడీకి మంచి సంబంధాలు ఉన్నాయి. పార్లమెంటులో అన్ని విషయాల్లోను సహకారం అందిస్తున్నారు. ప్రతి నెల నిధులు ఎన్ని కావాలంటే అంత అందిస్తున్నారు. ఈ క్రమంలో జగన్‌తో పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో పాగా వేయాలన్నది బీజేపీ ప్లాన్‌గా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే మోదీ, జగన్ ద్వయాన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారో వేచి చూడాల్సిందే..