కరోనాపై అవగాహన కల్పిస్తున్న మెగా కోడలు

కరోనా పేరు చెబితేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండగా మరోవైపు వేల సంఖ్యలో ప్రజలు తమ ప్రాణాలను పొగొట్టుకుంటున్నాయి. చైనాలో సోకిన కరోనా వైరస్ క్రమంగా 60దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 90వేలకు పైగా కేసులు నమోదు కాగా 3వేలమంది మృత్యువాత పడినట్లు ప్రాథమిక సమాచారం. తాజాగా కరోనా వైరస్ ఇండియాకు చేరింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నాయి. దుబాయ్ వెళ్లొచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కరోనా […]

Written By: Neelambaram, Updated On : March 3, 2020 2:53 pm
Follow us on

కరోనా పేరు చెబితేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండగా మరోవైపు వేల సంఖ్యలో ప్రజలు తమ ప్రాణాలను పొగొట్టుకుంటున్నాయి. చైనాలో సోకిన కరోనా వైరస్ క్రమంగా 60దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 90వేలకు పైగా కేసులు నమోదు కాగా 3వేలమంది మృత్యువాత పడినట్లు ప్రాథమిక సమాచారం. తాజాగా కరోనా వైరస్ ఇండియాకు చేరింది.

తెలుగు రాష్ట్రాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నాయి. దుబాయ్ వెళ్లొచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కరోనా వైరస్ బారినపడ్డాడు. ప్రస్తుతం అతడు హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తెలంగాణలో నమోదైన తొలి కేసు ఇదేకావడం గమనార్హం. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి కోడలు రాంచరణ్ భార్య ఉపాసన తాజాగా సోషల్ మీడియాలో స్పందించారు. కరోనా వైరస్ సోకకుండా ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

జ్వరం, దగ్గు, జలుబు చాతిలో నొప్పి వంటివి కరోనా ప్రాథమిక లక్షణాలని ఉపాసన పేర్కొన్నారు. ఈ లక్షణాలుంటే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. చేతులు శుభ్రంగా కడుక్కొని మాస్కులు ధరించాలన్నారు. మాంసాహరం తినడం వల్ల కరోనా సోకదన్నారు. మాంసాన్ని బాగా ఉడికించి తినాలని సూచించారు. వ్యాధి లక్షణాలుంటే బయట తిరగనీయవద్దన్నారు.

కరోనాకు ప్రస్తుతానికి మందు కనుగోనలేదని చెప్పారు. వ్యాధి లక్షణాలున్న వాళ్లు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆసుప్రతిలో చేరాలని సూచించారు. అపోలో హాస్పిటల్స్ యజమానులైన ఉపాసన వైద్య సేవల్లో పాలుపంచుకుంటారు. ఈ క్రమంలోనే మెగా కోడలు కరోనాపై తనవంతు బాధ్యతగా అవగాహన కల్పిస్తుంది. ఉపాసన కరోనాపై అవగాహన కల్పిస్తుండటంపై మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.