ట్విట్టర్ లో పవర్ చూపించిన వకీల్ సాబ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్సకత్వంలో రాబోతున్న బాలీవుడ్ రీమేక్ సినిమా ‘పింక్’ కు సంబంధించి పవన్ కళ్యాణ్ మొదటి లుక్ , టైటిల్ ను నిన్న విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్ విడుదల చేసిన కొన్ని క్షణాలలోనే ట్విట్టర్ ఇండియా ట్రేండింగ్ గా మారింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా పోస్టర్ విడుదల చేయగా ఇప్పటి వరకు 24.7 వేల రీట్విట్స్ రావడం విశేషం. మరోసారి పవన్ కళ్యాణ్ […]

Written By: admin, Updated On : March 3, 2020 3:42 pm
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్సకత్వంలో రాబోతున్న బాలీవుడ్ రీమేక్ సినిమా ‘పింక్’ కు సంబంధించి పవన్ కళ్యాణ్ మొదటి లుక్ , టైటిల్ ను నిన్న విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్ విడుదల చేసిన కొన్ని క్షణాలలోనే ట్విట్టర్ ఇండియా ట్రేండింగ్ గా మారింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా పోస్టర్ విడుదల చేయగా ఇప్పటి వరకు 24.7 వేల రీట్విట్స్ రావడం విశేషం.

మరోసారి పవన్ కళ్యాణ్ పవర్ చూపించడంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా తియ్యనున్నాడు. ‘వకీల్ సాబ్’ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 30 రోజులు కేటాయించి 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.