Upasana Konidala: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan), ఉపాసన(upasana konidela) దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు అనే వార్త, గత ఏడాది మెగా అభిమానుల్లో ఎలాంటి సంతోషాన్ని నింపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. క్లిన్ కారా పుట్టినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు ఎంత సంతోషించారో, ఈ వార్తని విని అంతకు మించి సంతోషించారు. ఈసారి ఉపాసన ఒక బిడ్డకు కాదు, ఇద్దరి బిడ్డలకు జన్మనివ్వబోతోంది. గత ఏడాది అక్టోబర్ నెలలో ఉపాసనకు సీమంతా ఫంక్షన్ కూడా జరిగింది. అప్పటి నుండి ఆమె ఇంట్లోనే ఉంటుంది. రామ్ చరణ్ కూడా షూటింగ్ లేని సమయాల్లో ఉపాసన తోనే ఉంటున్నాడు. కొన్ని కొన్నిసార్లు ఉపాసన కోసం ఆయన షూటింగ్ ని రద్దు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే రీసెంట్ గా ఉపాసన బేబీ బంప్ తో ఉన్నటువంటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ప్రముఖ జపనీస్ చెఫ్ అసవా తకమాసా వెళ్ళాడు. అతని వద్దకు రామ్ చరణ్, ఉపాసన వెళ్ళినప్పుడు దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఉపాసన క్లిన్ కారా కి జన్మనిచ్చినప్పుడు సోషల్ మీడియా లో అనేక రూమర్స్ వినిపించేవి. ఉపాసన సరోగసి పద్దతి ద్వారా బిడ్డకు జన్మనిస్తుంది, ఆమె గర్భం లో బిడ్డ పెరగడం లేదని, ఇలా ఎన్నో రకాల వార్తలు అప్పట్లో ప్రచారం అయ్యేవి. అంతే కాకుండా రీసెంట్ గా ఆమె కవల పిల్లలకు జన్మనిస్తున్నప్పుడు కూడా ఇదే తరహా ప్రచారం జరిగింది. మరోసారి ఉపాసన సరోగసి ద్వారా బిడ్డలను పొందబోతుంది అంటూ ప్రచారం చేశారు. కానీ నేడు ఆమె ఫోటోలలో బేబీ బంప్ తో కనిపించడం తో ఇన్ని రోజులు సోషల్ మీడియా లో వచ్చిన రూమర్స్ కి చెక్ పడింది.