Krishna Vamsi vs Ramya Krishna: టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండియాలో ఒక వెలుగు వెలిగిన రమ్యకృష్ణ(Ramya krishna), ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగుతుండం మనమంతా చూస్తూనే ఉన్నాం. విభిన్నమైన క్యారెక్టర్స్ పోషిస్తూ, దేశం లోనే అత్యధిక రెమ్యూనరేషన్స్ తీసుకునే క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఒకరిగా రమ్యకృష్ణ ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక ఆమె భర్త కృష్ణ వంశీ(Krishnavamsi) గురించి తెలిసిందే. ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ మోస్ట్ డైరెక్టర్. నిన్నే పెళ్లాడట, గులాబీ,మురారి , చందమామ, ఖడ్గం ఇలా ఎన్నో సంచలనాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మధ్యలో వరుసగా ఫ్లాప్స్ రావడం వల్ల నేటి తరం స్టార్ హీరోలు ఇతని వైపు చూడడం మానేశారు. అయితే ఇతను ఫార్మ్ లో లేకపోయినప్పటికీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పిలిచి మరీ ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చాడు.
ఊర మాస్ ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరం గా ఉన్నాడు , ఈ ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం తో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గర అవుతాడు, మా హీరోకి మరో మురారి లాంటి మూవీ ని ఇస్తాడని అభిమానులు అనుకున్నారు. కానీ తీరా చూస్తే మురారి చిత్రాన్నే ‘గోవిందుడు అందరివాడేలే’ లాగా రీమేక్ చేసినట్టుగా ఆడియన్స్ కి అనిపించింది. ఇక ఆ సినిమా తర్వాత ఇతని కెరీర్ ముగిసిపోయింది. ఇది కాసేపు పక్కన పెడితే, వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తే ఈయన రమ్య కృష్ణ తో విడిపోయాడని, చాలా కాలం నుండి వీళ్లిద్దరు వేర్వేరుగా ఉంటున్నారని సోషల్ మీడియా లో ప్రచారం సాగింది. దీనిపై రెండు మూడు సార్లు కృష్ణవంశీ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి రీసెంట్ ఇంటర్వ్యూ లో ఈ అంశంపై ప్రస్తావించాడు.
ఆయన మాట్లాడుతూ ‘చెన్నై లో రమ్య, హైదరాబాద్ లో నేను ఉండడం వల్ల అత్యధిక శాతం మంది మేము విడిపోయామని అనుకుంటున్నారు. ఈ వార్త మేమిద్దరం చూసి నవ్వుకున్నా సందర్భాలు ఉన్నాయి. రమ్య కి అవసరమైనప్పుడల్లా హైదరాబాద్ కి వస్తుంది, నేను కూడా చెన్నై కి ఆమె కోసం వెళ్తూ ఉంటాను, మేమిద్దరం కలిసి పెద్దగా సినిమాలకు, ఫంక్షన్స్ కి వెళ్ళము, అందుకే అందరూ మేము విడిపోయామని అనుకుంటూ ఉంటారు. అందులో ఎలాంటి నిజం లేదు. మా ఇద్దరి మధ్య ప్రేమాభిమానులు చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. ఇక మా అబ్బాయి సినిమాల్లోకి వస్తాడా అని చాలా మంది అడుగుతున్నారు. ప్రస్తుతం నా కొడుకు రిత్విక్ లండన్ లో చదువుకుంటూ ఉన్నాడు. వాడికి సినిమాలపై ఎలాంటి ఆసక్తి లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు కృష్ణ వంశీ.