https://oktelugu.com/

Kanguva: కంగువ లో వార్ సీన్ కోసం ఎన్ని కోట్లు పెట్టారో తెలుసా..? దీని ముందు బాహుబలి వార్ కూడా చిన్నదేనా..?

ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. అయితే సూర్య, బాబీ డియోల్ మధ్య 10 వేల మందితో ఒక భారీ వార్ సీన్ ను షూట్ చేశారట.

Written By:
  • Gopi
  • , Updated On : May 18, 2024 / 10:51 AM IST

    How many crores were spent for the war scene in Kanguva

    Follow us on

    Kanguva: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు సూర్య.. అయితే ఈయన వరుస సినిమాలు చేస్తూ సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేయడంలో సూర్య ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. అందువల్లే ఆయన కెరియర్ లో ఇప్పటివరకు చాలా ప్రయోగాత్మకమైన సినిమాలను చేసి సక్సెస్ లను కూడా సాధించాడు. ఇక ఇప్పుడు శివ దర్శకత్వంలో ‘ కంగువ’ అనే సినిమా చేస్తున్నాడు.

    ఇక ఈ సినిమాతో మరోసారి తను మరొక పెద్ద ప్రయోగాత్మకమైన సినిమా అయితే చేస్తున్నాడనే చెప్పాలి. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇంకా చాలా గ్రాఫికల్ షాట్స్ తో ఈ సినిమా విజువల్ వండర్ ని క్రియేట్ చేయబోతుందనే విషయమైతే ఈ సినిమా గ్లింప్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఇక ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. అయితే సూర్య, బాబీ డియోల్ మధ్య 10 వేల మందితో ఒక భారీ వార్ సీన్ ను షూట్ చేశారట.

    ఈ ఒక్క ఫైట్ కోసమే దాదాపు 5 కోట్ల వరకు ఖర్చు పెట్టారట.. అయితే ఈ వార్ సీన్ సినిమాకి హైలెట్ కాబోతుందట.అయితే ఈ వార్ సీన్ లో ఒకటి రెండు చిన్న చిన్న ప్యాచ్ వర్క్ షాట్స్ ఉండడం వల్ల మరోసారి జూనియర్ ఆర్టిస్టులతో ఈ సినిమాలోని ప్యాచ్ వర్క్ ని పూర్తి చేయాలనే ఉద్దేశ్యం లో శివ ఉన్నారట. ఇక మొత్తానికైతే ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకొని తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతుంది.

    మరి ఇలాంటి క్రమంలో ప్యాచ్ వర్క్ పెట్టుకోవడం సరైనదేనా అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
    ఇక మొత్తానికైతే ఈ సినిమాతో సూర్య మరోసారి పాన్ ఇండియాలో తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి శివ ఈ సినిమాతో పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.