spot_img
Homeఅప్పటి ముచ్చట్లుRaghavendra Rao: ఈ అమ్మాయి బాగుందయ్యా.. మనకు చక్కగా సరిపోతుంది !

Raghavendra Rao: ఈ అమ్మాయి బాగుందయ్యా.. మనకు చక్కగా సరిపోతుంది !

Raghavendra Rao: రాఘవేంద్రరావు అనే కుర్రాడు ‘జ్యోతి’ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్న రోజులు అవి. అప్పటికే హీరోగా మురళీమోహన్ అనే చిన్న హీరోని ఖాయం చేసుకున్నారు. కానీ హీరోయినే ఖరారు కావడం లేదు. మద్రాసు నుంచి కేరళ వరకూ ఎందరో అమ్మాయిలు వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ రాఘవేంద్రరావుకి మాత్రం ఎవ్వరూ నచ్చడం లేదు. మరో పక్క సినిమా షూటింగ్ కి లేట్ అవుతుంది. దీనికితోడు నిర్మాతల్లో అసంతృప్తి ఎక్కువవుతుంది. సినిమా ఎక్కడ ఆగిపోతుందో అని మురళీమోహన్ లో భయం పట్టుకుంది.
Raghavendra Rao
ఓ రోజు ఉదయం చిన్నగా రాఘ‌వేంద్ర‌రావు దగ్గరకు వెళ్లి పక్కన కూర్చున్నాడు. తాను అప్పటికే చేస్తోన్న ‘ల‌క్ష్మ‌ణ రేఖ‌’ అనే సినిమా గురించి, ఆ సినిమాలో హీరోయిన్ గురించి రాఘ‌వేంద్ర‌రావుకి గొప్పగా చెప్పడం మొదలు పెట్టాడు. కాసేపు ఆలోచించి ‘ఎవరు ఆ హీరోయిన్ ?’ అంటూ రాఘ‌వేంద్ర‌రావు అడిగారు. ‘పేరు జ‌య‌సుధ, మొదటిసారి హీరోయిన్ గా చేస్తోందండీ’. ‘అమ్మాయి బాగుంటుందా ? బాగా న‌టిస్తోందా ?’ అంటూ మురళీమోహన్ మొహంలోకి చూశారు రాఘ‌వేంద్ర‌రావు.

‘అద్భుతమైన ఫేసు అండీ. నటన విషయంలో మంచి నటి, చాలా బాగా నటిస్తోంది అండీ’ అని సైలెంట్ అయిపోయాడు మురళీమోహన్. ఎక్కువ చెప్పినా సమస్యే అని. ‘సరే, ఇంతగా చెబుతున్నావ్ కాబట్టి, ఒకసారి ఆ అమ్మాయి ఆల్బమ్ తెప్పించు, చూద్దాం’ అన్నాడు రాఘ‌వేంద్ర‌రావు. అదే రోజు సాయంత్రం మురళీమోహన్ తెప్పించిన ఆల్బమ్ ను రాఘవేంద్రరావు పరీక్షగా చూస్తూ కూర్చున్నాడు.

అది చూస్తూ మురళీమోహన్ లో టెన్షన్ పెరిగిపోతూ ఉంది. అనవసరంగా ఎక్కువ మాటలు చెప్పి.. స్వయంగా ఆల్బమ్ తెచ్చి ఇచ్చాడు. వ్యవహారం అటు ఇటు అయితే తన పోస్టుకే ప్రమాదం. ఆల్బమ్ మూసేసి రాఘ‌వేంద్ర‌రావు మురళీమోహన్ వైపు సీరియస్ గా చూస్తూ.. ‘ఈ అమ్మాయి బాగుందయ్యా. ఎక్స్‌ ప్రెసివ్ కళ్ళు, ఫేస్‌ కూడా బాగుంది. మనకు చక్కగా సరిపోతుంది’ అని ముగించారు రాఘ‌వేంద్ర‌రావు.

ఆ తర్వాత రోజే జయసుధను అఫీస్ కి పిలిచారు. ఆమెతో రాఘ‌వేంద్ర‌రారే గంట సేపు మాట్లాడి.. ‘అమ్మాయి బ్రహ్మాండంగా నటిస్తోంది, ఈమె మన హీరోయిన్’ అని చివరకు జయసుధను ‘జ్యోతి’ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ చేశారు. ఆ సినిమా జయసుధ కెరీర్ కి పెద్ద ప్లస్ అయింది. అంతకుముందు చిన్న చిన్న పాత్రలే చేసే జయసుధ ఒక్కసారిగా స్టార్ అయింది. అలాగే రాఘవేంద్రరావుకి కూడా దర్శకేంద్రుడిగా ఎదగడానికి ‘జ్యోతి’ సినిమానే పునాది అయింది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

YSRCP

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....
Perni Nani

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...
YS JaganMohan Reddy

Jagan Mohan Reddy: జగన్ వైఖరిపై ఆ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులు. కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేక జగన్మోహన్ రెడ్డి...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: టిక్కెట్ లేదు.. పార్టీ కోసం పని చెయ్.. ఆ సీనియర్ కు తేల్చి...

YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. ఆ పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన...
Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy : సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం… నెక్స్ట్ భూమన?!

Bhumana Karunakar Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. వారి వ్యక్తిగత వ్యవహార శైలి, భూ కబ్జా ఆరోపణలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్...
Oktelugu Epaper