Samantha Chaitanya Divorce: నిజమే.. నాగ చైతన్య – సమంత విడాకుల వ్యవహారం తెలుగు ప్రేక్షకుల్ని షాక్ కి గురి చేసింది. గత రెండు నెలల క్రితం ‘ఆహా’ కోసం సామ్ చేస్తోన్న ఓ ప్రోగ్రామ్ లో చైతు పాల్గొన్నాడు. ఇద్దరి మధ్య జరిగిన ముచ్చట్లు చూడముచ్చటగా ఉన్నాయి. ఒకరికి ఒకరు ఎంతో ప్రేమగా నడుచుకున్నారు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉందనే భావన కలిగింది. కానీ అంతలో ఏమైందో ? రెండు నెలలు తిరిగేలోపే విడాకులతో తమ వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ చెప్పారు. అక్కినేని ఫ్యామిలీతో పాటు అభిమానులను కూడా ఈ అంశం తీవ్ర విస్మయానికి గురి చేసింది.

అయితే, విడాకుల వ్యవహారంపై అనేక ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా సమంత వ్యక్తిగత జీవితం పై ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేశారు. ఈ నేసథ్యంలోనే విక్టరీ వెంకటేశ్ చేసిన ఓ మెసేజ్ ప్రస్తుతం నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది. ‘మనం ఏదైనా విషయంపై మాట్లాడే ముందు దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించాలి’ అని వెంకటెశ్ ఒక పోస్ట్ చేశాడు.
అయితే, వెంకీ ఆ పోస్ట్ చేయడానికి ‘ఎఫ్ 3’ సినిమాలో నటిస్తున్న ఇద్దరు వ్యక్తులు కారణం అట. వెంకీ ‘ఎఫ్ 3’ షూట్ లో ఉండగా చైతు – సామ్ తమ విడాకుల ప్రకటన చేశారు. అయితే, ‘ఎఫ్ 3’ సెట్ లో ఆ విడాకుల పై తోటి హీరో, అలాగే మరో ప్రముఖ నటుడి మధ్య ఓ ఆసక్తికర చర్చ జరిగిందట. ఆ చర్చ సమంత వ్యక్తిగత జీవితం పైనే నడిచిందని, అలాగే చైతు అమాయకుడు అంటూ కూడా వారిద్దరూ చర్చించుకున్నారట.
మొత్తానికి ఈ చర్చలోని ముఖ్యాంశాలు వెంకీ వరకు చేరాయి. అయితే, ఎవరు అయితే చర్చ పేరుతో వ్యక్తిగతంగా విమర్శలు చేసారో వారితో డైరెక్ట్ గా ఈ విషయం గురించి మాట్లాడకుండా వెంకీ సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టి, ఆ లింక్ ‘ఎఫ్ 3’ చిత్రబృందం మొత్తానికి పంపారట. దాంతో అనవసర మాటలు మాట్లాడటం ఎంత తప్పో ఆ యంగ్ హీరోకి, ఆ ప్రముఖ నటుడికి అర్ధమైంది.
ఇక ఆ ప్రముఖ నటుడు ఒకప్పుడు కామెడీ చిత్రాల హీరో. పైగా హీరోగా ఇరవై ఏళ్ల పాటు సక్సెస్ ఫుల్ గా కొనసాగాడు. ఈ మధ్య అనిల్ రావిపూడి చేస్తోన్న ప్రతి సినిమాలో ఆ ప్రముఖ నటుడు నటిస్తూ వస్తున్నాడు. ఆయనకు కాస్త నోటి దూల ఉందని కూడా ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది.