Comedian Ali: టాలెంట్ ఉన్నా.. కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించకపోతే.. జీవితాలే తారుమారై పోతాయి. అన్ని రంగాల మాదిరిగానే .. సినీ పరిశ్రమ కూడా విజయాలకు, అపజయాలకు అతీతం కాదు. సరైన ప్లానింగ్, భవిష్యత్ కార్యాచరణ పై స్పష్టత, ఆర్థికంగా నిలదొక్కుకోవడం ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో కారణాలుగా మారతాయి. అవే మన జీవితాలను శాసిస్తాయి.

టాలీవుడ్‌లో కెరీర్ పరంగా మంచి చిత్రాలను అందించిన హీరోలు, దర్శకులు చాలామంది ఉన్నారు. తొలుత మంచి హిట్స్ ఇచ్చిన వీరే.. ఆ తర్వాత చతికిలబడి పోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య ఆలీ ఓ సభకు వెళ్లారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. నేను సక్సెస్ ఫుల్ పర్సన్ని అనుకుంటారు. అయితే, వచ్చిన గొప్ప సక్సెస్ ను నిలబెట్టుకోలేకపోయిన ఫెయిల్యూర్ పర్సన్ని కూడా. అందుకే నేనెప్పుడూ నాకు గొప్పగా అనిపించను’ అంటూ ఆయన చెప్పుకుంటూ పోయారు.
ఆలీ కమెడియన్లలో సూపర్ స్టార్.. కానీ హీరోగా కూడా ఆయన మొదట్లో మంచి సక్సెస్ లు చూశారు. యమలీల, పిట్టలదొర, గన్ షాట్ లాంటి చిత్రాలతో వరుసగా హిట్లు కొట్టాడు ఆలీ. కామెడీ హీరోగా ఆలీ నిలబడిపోతాడు అనుకుంటున్న సమయంలో.. చేసిన కొన్ని పొరపాట్లు కారణంగా ఫేట్ పూర్తిగా మారిపోయింది. హిట్ సినిమాలు చేసాక, ఎందుకో ఆలీ ఆ తర్వాత హీరోగా తన స్థాయికి తగిన సినిమాలు చేయలేకపోయాడు.
వరుసగా ‘లో బడ్జెట్’ సినిమాలలో హీరోగా చేసిన ఆలీ, వరుస ప్లాప్ ల దెబ్బకు కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ హీరోగా నటించినా ఇక సక్సెస్ లు కొట్టలేకపోయాడు. మధ్యలో పెద్ద హీరోల సినిమాల్లో వేసిన కామెడీ వేషాలు సూపర్ హిట్ అయ్యాయి. దాంతో ఆలీకి దశ తిరిగింది. హాస్యనటుడిగా ఇప్పటికీ ఆలీ సూపర్ స్టారే.
Also Read: F3: సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఎఫ్3.. క్లారిటీ ఇచ్చిన వెంకి
కానీ హీరోగా మాత్రం నిలబడలేకపోయాడు. అప్పట్లో ఆలీకి వచ్చిన హిట్లు చూసుకుంటూ.. హీరోగా ఇంకా మంచి సినిమాలు చేయగలడమో అనిపిస్తుంది. కానీ కథల ఎంపిక లాంటి పొరపాట్లు కారణంగా కమెడియన్ గానే మిగిలిపోయాడు.
Also Read: Preetham Jukalker: చిరంజీవి కూతురు ఫొటోకు సమంత స్టైలిష్ట్ ప్రీతమ్ కామెంట్.. నెటిజన్ల షాక్