https://oktelugu.com/

చదరంగం’కే నితిన్ ఫిక్స్.. దసరాకి ఎనౌన్స్ మెంట్ !

హీరో నితిన్ పెళ్లి చేసుకున్నాక కూడా సినిమాలకు గ్యాప్ ఇవ్వకుండా ఇప్పటికే వరుస సినిమాల్ని ఒప్పుకున్నాడు. లాక్ డౌన్ తరువాత ముందుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసిన నితిన్.. ఈ సినిమా తరువాత చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో రానున్న సినిమా షూట్ ను మొదలపెట్టనున్నాడు. అయితే ఈ చిత్రానికి ‘చదరంగం’ అనే టైటిల్ పెట్టబోతున్నారని.. మేకర్స్ కూడా ఇదే టైటిల్ కు ఫిక్స్ అయ్యారని గతంలోనే వార్తలు వచ్చిన […]

Written By:
  • admin
  • , Updated On : September 29, 2020 / 03:52 PM IST
    Follow us on


    హీరో నితిన్ పెళ్లి చేసుకున్నాక కూడా సినిమాలకు గ్యాప్ ఇవ్వకుండా ఇప్పటికే వరుస సినిమాల్ని ఒప్పుకున్నాడు. లాక్ డౌన్ తరువాత ముందుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసిన నితిన్.. ఈ సినిమా తరువాత చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో రానున్న సినిమా షూట్ ను మొదలపెట్టనున్నాడు. అయితే ఈ చిత్రానికి ‘చదరంగం’ అనే టైటిల్ పెట్టబోతున్నారని.. మేకర్స్ కూడా ఇదే టైటిల్ కు ఫిక్స్ అయ్యారని గతంలోనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమాకి ‘చదరంగం’ అనే టైటిల్ నే ఫైనల్ చేశారని.. దసరాకి అధికారికంగా ప్రకటించిబోతున్నారని తెలుస్తోంది.

    Also Read: పేరు మార్చుకున్న యాంకర్ రష్మీ.. ఏం పేరు పెట్టుకుందో తెలిస్తే షాకే..

    ఈ టైటిల్ పెట్టడానికి కారణం.. సినిమాలో చదరంగం ఆటకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని.. అందుకే ‘చదరంగం’ అని టైటిల్ పెడుతున్నారట. ఇక నవంబర్ 7వ తేదీ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. ముందుగా నితిన్ – సునీల్ కలయికలో వచ్చే కామెడీ సీన్స్ ను షూట్ చేయనున్నారు. సునీల్ కి చాలా కాలం తరువాత ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ దొరికిందట. ఇక యేలేటి సినిమాలన్నీ కూడా మిస్టరీ, సస్పెన్స్ కూడిన కథలై ఉంటాయి. ఈ సినిమా కూడా మిస్టరీ నేపథ్యంలోనే ఉంటుందట. ఇక ‘చదరంగం’ చిత్రంతో పాటు నితిన్ మరో సినిమా కూడా మొదలుపెట్టనున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ పిరియాడిక్ ఫిల్మ్ చేస్తున్నాడు. ఈ సినిమాలోనే నితిన్ మూడు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు.

    Also Read: విజువల్ వండర్.. అవతార్-2లో ప్రత్యేకత అదేనా?

    ముప్పై ఏళ్ల వ్యక్తిగా అలాగే ఏభై ఏళ్ల వ్యక్తిగా అలాగే ఎనభైకి పై బడిన పండు ముసలాడిలా కనిపించబోతున్నాడు. ఈ సినిమా తన కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ అని ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నితిన్ చెప్పిన సంగతి తెలిసిందే. మొత్తానికి నితిన్ నుండి రాబోయే సినిమాలన్ని మంచి ఆసక్తికరంగా ఉండనున్నాయి. ఎలాగూ తన లాస్ట్ సినిమా ‘భీష్మ’తో సూపర్ హిట్ కొట్టాడు కాబట్టి.. మార్కెట్ పరంగా కూడా నితిన్ కి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. మరి తన కొచ్చిన సక్సెస్ ను నితిన్ ఎలా కొనసాగిస్తాడో చూడాలి. ఇప్పుడు చేస్తోన్న సినిమాల్లో ఒక సినిమా సూపర్ హిట్ అయినా.. నితిన్ స్థాయి మరింతగా పెరుగుతుంది.