https://oktelugu.com/

BalaKrishna – Venakesh : ఏపీలో బాలయ్య, వెంకీలకు ఊహించని షాక్, సంక్రాంతి చిత్రాల కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం!

సంక్రాంతి చిత్రాలకు హైకోర్ట్ తీర్పు కంటకంగా మారింది. అదనపు షోల విషయంలో కీలక ఆదేశాలు ఇచ్చింది. అర్థరాత్రి బెనిఫిట్ షోలకు అనుమతులు నిరాకరించింది. హైకోర్ట్ తాజా నిర్ణయం డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపనుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : January 10, 2025 / 08:59 PM IST

    BalaKrishna - Venakesh

    Follow us on

    BalaKrishna – Venakesh : ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఇకపై స్పెషల్ షోలకు, టికెట్స్ ధరల పెంపుకు అనుమతులు ఇచ్చేది లేదని వెల్లడించారు. ఈ నిర్ణయంపై పునరాలోచించాలని టాలీవుడ్ ప్రముఖులు సీఎంతో భేటీ అయ్యారు. అసెంబ్లీలో చేసిన ప్రకటనకే కట్టుబడి ఉన్నామని సీఎం అన్నారు. అయితే గేమ్ ఛేంజర్ సినిమాకు తెల్లవారు జాము నుండి స్పెషల్ షోలు వేసుకునేందుకు, అలాగే టికెట్స్ ధరలు పెంచి విక్రయించేందుకు అనుమతులు ఇచ్చారు.

    ఏపీలో కూడా గేమ్ ఛేంజర్ మూవీ టికెట్స్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు లభించాయి. తెలంగాణ ప్రభుత్వం గేమ్ ఛేంజర్ చిత్రానికి ప్రత్యేక షోలు ప్రదర్శించేందుకు అనుమతులు ఇవ్వడంపై హైకోర్ట్ అసహనం వ్యక్తం చేసింది. తాజాగా హైకోర్ట్ జనవరి 12, 14 తేదీలలో విడుదలవుతున్న డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల ప్రత్యేక ప్రదర్శనలపై ఆంక్షలు విధించింది. కోర్టు ఆదేశాల ప్రకారం అర్ధరాత్రి 1 గంట, 4 గంటల షోలకు అనుమతులు ఉండవు. అదనంగా ఒక షోతో, రోజుకు 5 షోలు మాత్రమే ప్రదర్శించాలని సూచనలు చేసింది.

    ఈ 5 షోలలో ఒకటి బెనిఫిట్ షోగా ప్రదర్శించే వెసులుబాటు కల్పించింది. ఈ క్రమంలో డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలకు అదనంగా 6వ షో ఉండదు. ఇది ఆ చిత్ర వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీ పెద్దగా నష్టపోయే అవకాశం లేదు. వెంకటేష్ స్టార్డం, మార్కెట్ రీత్యా అదనపు షోల వలన ప్రయోజనం అంతగా ఉండదు. డాకు మహారాజ్ కి భారీ నష్టం వాటిల్లనుంది. గేమ్ ఛేంజర్ సైతం వసూళ్ల పరంగా తీవ్రంగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

    ఇక సంక్రాంతి చిత్రాలు కోర్టు సూచనలు పాటించాల్సిందే. చూస్తుంటే భవిష్యత్ లో ఏపీ/తెలంగాణలో టాలీవుడ్ కి చెందిన భారీ చిత్రాలు గడ్డు పరిస్థితులు చవి చూసే అవకాశం ఉంది. స్టార్ హీరోలు వందల కోట్ల బడ్జెట్స్ తో సినిమాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకు లాంగ్ రన్ ఉండదు. వీకెండ్ కి యాభై శాతం, మొదటి వీక్ కి 80-90 శాతం బిజినెస్ రాబట్టాల్సి ఉంటుంది. గతంలో మాదిరి వందల రోజులు సినిమాలు ఆడే పరిస్థితి ఇప్పుడు లేదు. అందుకే ఓపెనింగ్స్ ద్వారానే మేజర్ వసూళ్లు రాబట్టాలని నిర్మాతలు భావిస్తున్నారు.