Bigg Boss 9 Telugu Updates: ఈ బిగ్ బాస్ సీజన్(Bigg Boss 9 Telugu) లో టైటిల్ కి అతి దగ్గరగా ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరు పవన్ కళ్యాణ్. మొదటి వారం నుండి కనీవినీ ఎరుగని రేంజ్ ఓటింగ్ తో భారీ లీడింగ్ తో కొనసాగుతున్న తనూజ కి పోటీ ని ఇచ్చిన ఏకైక కంటెస్టెంట్ ఈయన మాత్రమే. వాస్తవానికి పవన్ కళ్యాణ్ మొదటి మూడు వారాలు అసలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు అనే విషయాన్ని కూడా ఆడియన్స్ గమనించలేదు. ఇతని కంటెంట్ మొత్తం చాలా నెగిటివ్ గా ఉండేది. అమ్మాయిలను ఓదార్చడానికి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు , ఓదార్పు పేరుతో అమ్మాయిలపై ఇష్టమొచ్చినట్టు చేతులు వేస్తున్నారు అంటూ ఆడియన్స్ ఇతని పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మూడవ వారం లో ప్రియా తో పాటు డేంజర్ జోన్ లోకి వచ్చాడు. తృటిలో ఎలిమినేషన్ ని తప్పించుకున్నాడు.
ఆయన గ్రాఫ్ మొదటి మూడు వారాలు అంత దారుణంగా ఉండేది. ఇక ప్రియా ఎలిమినేట్ అయినప్పటి నుండి తన గేమ్ ని మార్చుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఇమ్మానుయేల్ తో కలిసి ఇతను ఆడిన కెప్టెన్సీ టాస్కులు ఒక వారం బాగా హైలైట్ అయ్యాయి. అప్పటి నుండి ఈయన గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత తనూజ తో స్నేహమో, లేదా ప్రేమ అనేది ఆడియన్స్ కి కూడా అర్థం కానీ రిలేషన్ ని ఒకటి మైంటైన్ చేసాడు. ఆ కారణం చేతనే ఇతనికి కంటెంట్ బాగా వచ్చేది. ఇప్పటికీ ఇతనికి కంటెంట్ కేవలం తనూజ వల్లే వస్తుందని అంటుంటారు. అయితే నిన్న జరిగిన టికెట్ టు ఫినాలే టాస్క్ లో భరణి కళ్యాణ్ ని పూర్తిగా ఎక్స్ పోజ్ చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. నిన్న ఆయనకు టాస్కు లో అన్యాయం జరగడం, రీతూ చేసిన మోసాన్ని తట్టుకోలేక ఫైర్ అవ్వడం, హౌస్ లో తనకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతూ ‘లైట్ టాస్క్’ వ్యవహారం తీసుకొని రావడం జరిగింది.
అప్పట్లో తనూజ ని వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున కన్ఫెషన్ రూమ్ కి పిలిచి, డిమోన్ పవన్, పవన్ కళ్యాణ్ లు కలిసి ఆడడం వల్లే నీకు కెప్టెన్ అయ్యే అవకాశం పోయిందని వీడియో వేసి చూపిస్తాడు నాగార్జున. ఈ విషయం కేవలం తనూజ కి మాత్రమే తెలుసు. భరణి ఒక వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళొచ్చాడు కాబట్టి, అతను ఈ వీడియో ని చూసి ఉండొచ్చు. ఇదే విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తాడు భరణి. దీంతో పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వడం మొదలు పెట్టి గొడవకు దిగుతాడు. కన్ఫెషన్ రూమ్ లో ఏ వీడియో చూపించారో నాకు తెలుసు అంటూ వస్తాడు. తనూజ ఎప్పుడు కూడా ఏ వీడియో ని చూపించారో పవన్ కళ్యాణ్ కి చెప్పలేదు. అతనికి ఆ వీడియో సంగతి చెప్పింది హౌస్ లోపలకు వచ్చిన శ్రీజ. బయట ఏమి జరుగుతుందో అన్నీ పవన్ కళ్యాణ్ కి వివరించి అతని ఆటను మాచుకునేలా శ్రీజ చేసిందనే విషయం నిన్నటితో బయటపడింది. దీంతో సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ ని నెటిజెన్స్ ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.