Bigg Boss 9 Telugu Tanuja: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) టైటిల్ కి ఒక్క అడుగు దూరం లో ఉన్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది తనూజనే. ఇది నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా పోల్స్ ద్వారా వేసిన అంచనా. కానీ నిన్నటి ఎపిసోడ్ తో ఈమెపై ఆడియన్స్ కి కలిగిన కోపం చూస్తుంటే టైటిల్ రేస్ కి ఆమడదూరం లో ఆగిపోయినట్టు అనిపిస్తుంది. తనకు బిగ్ బాస్ హౌస్ లో ఎవరి సపోర్ట్ లేదని, తన సొంత కష్టం మీద ఇంత దూరం వచ్చానని ఈమె చెప్పిన సమాధానంకి హోస్ట్ నాగార్జున కి కూడా మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. అలా మాట్లాడడం చాలా పెద్ద తప్పు అంటూ నాగార్జున చెప్పడం మాత్రమే కాదు, ఈ షో ని చూడడానికి వచ్చిన ఆడియన్స్ కూడా తప్పుబట్టారు. అంతే కాకుండా ఈమె నాకు సపోర్టు లేదు అన్నప్పుడు వెనుక ఉన్నటువంటి ఇమ్మానుయేల్, రీతూ చౌదరి రియాక్షన్స్ ని చూసి వెయ్యి బూతులు వెతుక్కోవచ్చు.
ఈమెకు మొదటి నాలుగు వారాలు ఒక పక్క ఇమ్మానుయేల్, మరోపక్క భరణి ఇచ్చిన సపోర్టు మామూలుది కాదు. భరణి అయితే ఈమెని కాపాడడం కోసం బెడ్ టాస్క్ లో శ్రీజ ని అత్యంత దారుణంగా క్రిందకు నెట్టి ఆడియన్స్ దృష్టిలో చాలా బ్యాడ్ అయ్యాడు. ఫలితంగా ఆ పక్క వారం లో ఆయన ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయం ఆమెకు తెలుసు, అయినప్పటికీ కూడా ఎందుకు ఆమె అంతలా నోరు జారింది అనేది అర్థం కావడం లేదు. ఇక పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. గత మూడు వారాల నుండి అతను తనూజ ని కెప్టెన్ ని చేయడమే తన గేమ్ ప్లాన్ గా మార్చుకున్నాడు. సమయం వచ్చినప్పుడు దివ్య కి బదులుగా తనూజ ని ఎంచుకొని ఆమె కెప్టెన్ అయ్యేందుకు సహాయపడ్డాడు.
ఇంత చేసిన కళ్యాణ్ కూడా ఆమెకు సపోర్ట్ చేయలేదట. ఇది ఆమెకు చాలా పెద్ద మైనస్ అయ్యింది. ఇక గత వారం లో అయితే హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటిరోజు నుండి నాన్న అని పిలుస్తూ, ఆయన కోసం ప్రాణాలు కూడా ఇచ్చేంత ప్రేమ చూపించిన తనూజ, తానూ డేంజర్ జోన్ లోకి వచ్చినప్పుడు నాకోసం సేవింగ్ పవర్ వాడుతావా?, నిన్ను ఇప్పటి వరకు ఎప్పుడూ ఏది అడగలేదు, దయచేసి నా కోసం ఇదొక్కటి చెయ్యి అని బ్రతిమిలాడుతాడు. అందుకు ఆమె ఇచ్చిన సమాధానం అలోచించి చెప్తా అనడం. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా?..ఈ ఘటన కూడా ఆమెకు పెద్ద మైనస్ అయ్యేలా చేసింది. ఈ రెండు ఘటనలు తనూజ ని టైటిల్ రేస్ కి ఆమడ దూరంలో ఉండేలా చేసింది. ఇంకొక్క నెగిటివ్ ఎపిసోడ్ పడితే ఆమెకు టాప్ 5 లో చోటు దక్కే అవకాశాలు కూడా ఉండవు అనడంలో ఎలాంటి సందేహం లేదు.