Naga Chaitanya: బిస్‌బాస్ సీజన్5 టైటల్ విన్నర్ ఎవరా అన్న ఉత్కంఠ ఇప్పటికి వీడింది. నిన్న రాత్రి జరిగిన గ్రాండ్ ఫైనల్లో సన్ని విజయం సాధించిన సంగతి తెలిసిందే. అన్ని రోజుల పాటు ఒకే హౌస్‌లో ఇంటిసభ్యుల మధ్య జరిగిన హారాహోరి పోటీలో చివరకు అందర్నీ పక్కకు నెట్టేసి ప్రేక్షకుల ప్రేమాభిమానాలతో ఇవాల్టి స్టార్‌గా గుర్తింపు పొందిన వ్యక్తి సన్ని. కాగా, ఈ ఫైనల్ బిగ్‌బాస్ ఎపిసోడ్‌కు టాలీవుడ్, బాలీవుడ్ నుంచి స్టార్ సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ క్రమంలోనే సరదాగా హౌస్‌మేట్స్‌తో ముచ్చటించి సందడి చేశారు. కాగా, వీరిలో రాజమౌళి, అలియా భట్ తదితరులు కూడా పాల్గొన్నారు.
కాగా, బిగ్‌బాస్ స్టేజ్‌పై బంగార్రాజు కూడా అడుగుపెట్టాడు. అక్కినేని వారసుడు నాగచైతన్య ఈ షోలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా చైతూ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
Also Read: సమంతతో చైతన్య విడిపోడానికి కారణం ఇదేనా?.. వైరల్‌గా చై రీసెంట్ ఇంటర్వ్యూ
త్వరలో ప్రసారం కానున్న ప్రో కబడ్డీ బ్రాండ్ అంబాసిడర్‌గా నాగ చైతన్య ఎంపికయ్యారు. ఈ విషయాన్ని స్టార్ మా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. గతంలో ప్రొ కబడ్డీ బ్రాండ్ అంబాసిడర్‌గా రానా వ్యవహరించగా.. ఈ ఏడాది చైతన్య బాధ్యతలు తీసుకోనున్నారు. లేపంగా అంటూ ఉత్కంఠగా సాగే ఈ పోటీలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
జెర్సీ మాత్రమే కాదు కవచమది 💪
గ్రౌండ్ మాత్రమే కాదు పోరాట స్థలమది 🤜🤛ఆయుధాలు లేకుండా జరిగే ఈ అత్యుత్తమ యుద్ధంలో 🔥
@Telugu_Titans సత్తాచాటడానికి సిద్ధమంటుంది 🥳రా.. చూద్దాం! 😍
#VivoProKabaddi
Dec 22 నుంచి
మీ #StarSportsTelugu 📺 pic.twitter.com/w9Gn5L6ck4— chaitanya akkineni (@chay_akkineni) December 12, 2021
కాగా, చై ప్రస్తుతం లాల్‌సింగ్ చద్దా సినిమాలో నటిస్తున్నారు. అమిర్‌ఖాన్ హీరోగా వస్తున్న ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, దీంతో పాటు థాంక్యూ అనే సినిమాలోనూ నటిస్తున్నారు. బంగార్రాజులోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Also Read: కూతురునిచ్చి నాగచైతన్యను బాలయ్య ఎందుకు అల్లుడిగా చేసుకోలేదో తెలుసా? కారణమిదీ!