https://oktelugu.com/

Trivikram: త్రివిక్రమ్ తో సినిమాకి కమిట్ అవుతున్న ఇద్దరు స్టార్ హీరోలు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ రచయితకు దక్కని అరుదైన గౌరవం త్రివిక్రమ్ శ్రీనివాస్ కి దక్కింది. ఆయన కథ మాటలు అందించిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ లు సాధించడమే కాకుండా 100% సక్సెస్ రేట్ ని కలిగిన ఏకైక రచయితగా కూడా తను పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు...ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడంలో ఆయన సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : November 24, 2024 / 12:16 PM IST

    Trivikram Srinivas

    Follow us on

    Trivikram: మాటల మాంత్రికుడు గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరియర్ మొదట్లో తమదైన రీతిలో కథ మాటలను రాయడమే కాకుండా రచయితల స్టాండర్డ్ ని కూడా పెంచాడు. స్టార్ రైటర్ గా పేరు తెచ్చుకున్న తర్వాత దర్శకుడి గా మారి సూపర్ హిట్ సినిమాలను చేయడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ డైరెక్టర్ ఇంతకుముందు చేసిన ‘గుంటూరు కారం’ సినిమాతో బొక్క బోర్లా పడ్డాడు. ఇక అప్పటినుంచి ఆయనతో సినిమా చేయడానికి పెద్ద హీరోలు ఎవరు పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో అంతకుముందే కమిట్ అయిన అల్లు అర్జున్ కూడా ఆయనతో సినిమా చేయాలా వద్దా అనే డైలామాలో పడిపోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందా? లేదా అనే డౌట్ అయితే వ్యక్తమవుతుంది. ఇక ఏది ఏమైనా కూడా త్రివిక్రమ్ మాత్రం అల్లు అర్జున్ తో సినిమా ఉన్న లేకపోయినా మిగతా హీరోలను కూడా లైన్ లో పెడుతున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి రెడీగా ఉన్న హీరోలు కొంతమంది ఉన్నారు. వాళ్ళలో ఒకరు విజయ్ దేవరకొండ కాగా, మరొకరు తమిళ్ స్టార్ హీరో అయిన సూర్య కావడం విశేషం…ఇక ఇప్పటికే త్రివిక్రమ్ వీళ్ళతో సంప్రదింపులు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

    మరి అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిజల్ట్ ను బట్టి త్రివిక్రమ్ కి అవకాశం ఇవ్వాలా వద్దా అనే ధోరణిలో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ అవకాశం ఇచ్చిన ఇవ్వకపోయినా కూడా త్రివిక్రమ్ సెకండ్ ఆప్షన్ కింద మిగతా హీరోలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక వరుసగా మూడు సక్సెస్ లను అందుకున్న అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ మరోసారి పట్టాలెక్కితే మాత్రం భారీ క్రేజ్ అయితే దక్కుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడడానికి చాలామంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి వీళ్ళ కాంబోలో సినిమా వస్తుందా రాదా అనే విషయం తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…